ఏదైనా ఆపదలో ఉన్నారంటే డయల్ 100.. ఏదైనా సమస్య వచ్చిందంటే డయల్ 100.. ఎవరినుంచైనా రక్షణ కావాలన్నా డయల్ 100.. అలా డయల్ 100కు ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది.. అయితే, డయల్ 100కు వచ్చే కాల్స్‌పై కూడా కొందరు పోలీసు అధికారులు సరిగా స్పందించడం లేదు.. దీంతో, ఓ ఎస్ఐ, కానిస్టేబుల్‌పై వేటు పడింది… చిత్తూరు జిల్లా సోమల పోలీసుస్టేషన్ లో విధుల పట్ల నిర్లక్ష్యం వహిచారంటూ ఎస్సై లక్ష్మీకాంత్‌ను వీఆర్‌కు పంపించారు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి.. ఇదే సమయంలో.. కానిస్టేబుల్ మంజునాథ్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.. డయల్ 100 కాల్స్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వచ్చిన ఫిర్యాదుపై డీజీపీ సీరియస్ అయ్యారు.. దీనిపై విచారణ చేయాల్సిందిగా.. చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఎస్పీ రిశాంత్‌రెడ్డి.. విచారణ అనంతరం చర్యలకు పూనుకున్నారు.
Read Also: HP layoff: ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధం అవుతున్న హెచ్‌పీ.. ఏకంగా 6 వేల మంది తొలగింపు..!
మరోవైపు, కర్నూలు జిల్లా ఆదోని త్రి టౌన్ సీఐ చంద్రబాబు, ఎస్సై పిరయ్యపై సస్పెన్షన్ వేటు పడింది.. ఎస్సై పిరయ్య సున్నిపెంటలో విధులు నిర్వహించే సమయంలో వేద విద్యార్థి హత్య కేసులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.. సీఐ చంద్రబాబు.. బ్రహ్మణ కొట్కూరులో హత్యకేసును అనుమానాస్పద కేసు నమోదు చేసారని ఆరోపణలు ఉన్నాయి.. అయితే, ఆ ఇద్దిరనీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీఐజీ సెంథిల్ కుమార్.. ఇలా ఒకే రోజు.. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు.