నేచురల్ స్టార్ నానికి మళ్లీ రిలీజ్ కష్టాలు మొదలయ్యాయి. నాని తాజా చిత్రం “శ్యామ్ సింగ రాయ్” భారీ అంచనాల మధ్య డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమైంది. అయితే ఇప్పుడు నానిపై ఒత్తిడి బాగా పెరుగుతోంది. డిసెంబర్ రేసులో ఇప్పటికే ‘శ్యామ్ సింగ రాయ్’తో సహా మూడు నాలుగు సినిమాలు ఉండగా, ఇప్పుడు మరో మూవీ కూడా ఇదే నెలలో విడుదలకు సిద్ధమవుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొన్ని రోజుల క్రితం వరుణ్ తేజ్ ‘గని’ డిసెంబర్ 24న…
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన సందడి మొదలైంది. ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ నవంబర్ 18న గురువారం ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్ రిలీజ్ కు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉందంటూ తాజాగా మరో పోస్టర్ ను విడుదల చేశారు. దీంతో నాని అభిమానులు సోషల్ మీడియాలో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే…
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. ఈ సినిమాలో నాని డ్యూయల్ షేడ్‌లో కనిపించనుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మేకర్స్ ఇటీవలే ఫస్ట్ సింగిల్ ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ని విడుదలచేసి సినిమా కోసం ప్రమోషన్లను ప్రారంభించారు. ఈ పాటకు అందరి నుండి మంచి స్పందన వచ్చింది. అలాగే, విడుదలైన పోస్టర్‌లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి కథానాయికలుగా కనిపించనున్నారు. రాహుల్ సంకృత్యాన్…
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ పీరియాడిక్ డ్రామా “శ్యామ్ సింగ రాయ్”. డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్‌కి సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. “శ్యామ్ సింగ రాయ్”లో జిషు సేన్ గుప్తా, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి…
నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి , మడోన్నా సెబాస్టియన్, జిషు సేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం కీలక పాత్రలు పోషించారు. మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసారు. నాని ఫిల్మ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో…
న్యాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శ్యామ్ సింగరాయ్.. 1970 లో కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇక తాజాగా ఈ చిత్రం మొదటి సింగిల్ ని మేకర్స్ దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. రైజ్ ఆఫ్ శ్యామ్ పేరుతో ఒక…
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా పీరియాడికల్ డ్రామా “శ్యామ్ సింగ రాయ్”. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణానంతర దశలో ఉంది. ట్యాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్, ఇతర పోస్టర్‌లను ఆవిష్కరించినప్పటికీ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం సారధ్యం వహిస్తుండగా, మేకర్స్…
నాని హీరోగా రూపొందుతున్న ‘శ్యామ్ సింగ్ రాయ్’ ని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నీహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాష్టియన్ హరోయిన్స్ గా నటిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. వరస పరాజయాల్లో ఉన్న నానికి ఈ సినిమా విజయం ఎంతో ముఖ్యం. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ…
నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ కొద్ది నెలల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో వి.ఎఫ్.ఎక్స్. కు ప్రాధాన్యం ఎక్కువగా ఉండటం వల్ల నిర్మాణానంతర కార్యక్రమాలకు అధిక సమయం పడుతోందని రాహుల్ సాంకృత్యన్ తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన నాని, సాయిపల్లవి, కృతీశెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దసరా సందర్భంగా ‘శ్యామ్ సింగరాయ్’ మూవీలోని నాని…
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి షాకింగ్ డెసిషన్ తీసుకుంది. సినిమాల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసే ఈ బ్యూటీ కెరీర్ విషయంలోనూ తనకు నచ్చినట్టుగానే ముందుకు వెళ్తా అంటుంది. ప్రస్తుతం సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ సక్సెస్ ను ఆస్వాదిస్తోంది. మిగతా హీరోయిన్లకు భిన్నంగా గ్లామర్ ను పక్కన పెట్టి మంచి పాత్రలను ఎన్నుకునే సాయి పల్లవికి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. రొమాంటిక్ మూవీ ‘ప్రేమమ్’లో మలార్ మిస్ గా…