నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. ఈ సినిమాలో నాని డ్యూయల్ షేడ్‌లో కనిపించనుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మేకర్స్ ఇటీవలే ఫస్ట్ సింగిల్ ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ని విడుదలచేసి సినిమా కోసం ప్రమోషన్లను ప్రారంభించారు. ఈ పాటకు అందరి నుండి మంచి స్పందన వచ్చింది. అలాగే, విడుదలైన పోస్టర్‌లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి కథానాయికలుగా కనిపించనున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోల్‌కతాలో 1970 సంవత్సరంలో జరిగే కథ నేపథ్యంలో జరుగుతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్.
Read Also : ఆ హీరో నన్ను రేప్ చేసి బలవంతంగా తాళికట్టాడు.. బుల్లితెర నటి సంచలన వ్యాఖ్యలు
‘శ్యామ్ సింగ రాయ్’ మేకర్స్ నుండి తాజా అప్‌డేట్‌తో బజ్ రెట్టింపు అయ్యింది. నవంబర్ 18న టీజర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన పోస్టర్‌తో ప్రకటించారు. డిసెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.