నానికి తప్పని రిలీజ్ కష్టాలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నానికి మళ్లీ రిలీజ్ కష్టాలు మొదలయ్యాయి. నాని తాజా చిత్రం “శ్యామ్ సింగ రాయ్” భారీ అంచనాల మధ్య డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమైంది. అయితే ఇప్పుడు నానిపై ఒత్తిడి బాగా పెరుగుతోంది. డిసెంబర్ రేసులో ఇప్పటికే ‘శ్యామ్ సింగ రాయ్’తో సహా మూడు నాలుగు సినిమాలు ఉండగా, ఇప్పుడు మరో మూవీ కూడా ఇదే నెలలో విడుదలకు సిద్ధమవుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొన్ని రోజుల క్రితం వరుణ్ తేజ్ ‘గని’ డిసెంబర్ 24న విడుదల కానుందని ప్రకటించారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మేకర్స్ కూడా అదే తేదీన సినిమాను విడుదల చేయాలనీ భావిస్తున్నట్టు వస్తున్న వార్తలు నానిని ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి.
Read Also : “జై భీమ్”పై ఎమ్మెల్యే సీతక్క ట్వీట్
Also Read
మరోవైపు ‘పుష్ప’ వాయిదా పడుతుందని, డిసెంబర్ 24కి ఈ పాన్ ఇండియా సినిమా వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ డిసెంబర్ 24న వస్తే సోలో రిలీజ్ చేయాలని ‘పుష్ప’ టీమ్ చూస్తోంది. అదే గనుక జరిగితే ‘గని’ జనవరి 2022కి విడుదల తేదీని వాయిదా వేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ పరిణామాలన్నింటితో తలనొప్పి వచ్చేది నానికే. మరి నాని ఒత్తిడికి లోనయ్యి సినిమా తేదీని వాయిదా వేస్తారా? అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే పరిస్థితి చూస్తుంటే నాని కూడా వెనక్కి తగ్గేలా కన్పించడం లేదు. ఎందుకంటే ముందుగా అనుకున్న ప్రకారం ప్రమోషన్స్‌తో ముందుకు వెళ్తున్నాడు. గత రెండు చిత్రాలకు సంబంధించిన అనుభవాలు నానీని అదే తేదీకి కట్టుబడి ఉండేలా చేశాయి.
“శ్యామ్ సింగ రాయ్” టీజర్ ఈరోజు విడుదల కానుంది. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ “శ్యామ్ సింగ రాయ్” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న మాస్ డ్రామాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!