నేటి కాలంలో ఆచార్య దేవో భవకు అర్థమే మారిపోతుంది. సినిమాల ప్రభావమో.. లేదంటే సోషల్ మీడియా ప్రభావమో తెలియదు గానీ.. విద్యార్థులు గాడి తప్పుతున్నారు. మొన్నటికి మొన్న అహ్మదాబాద్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణతో టెన్త్ స్టూడెండ్‌ను 8వ తరగతి విద్యార్థి అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు.
ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. అంతేకాని చావును కాదు. ప్రేమ ప్రదర్శింపబడుతుంది. అది ఏ రూపంలోనైనా?. అంతేతప్ప.. ఏ విధంగాను మరణాన్ని కోరుకోదు. అయితే ప్రియురాలిని తన నుంచి దూరం చేశారన్న కోపంతో ఓ ప్రియుడు మూర్ఖంగా ప్రవర్తించాడు. ఏకంగా ప్రియురాలి తండ్రిపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు.
బీహార్‌లో దారుణం జరిగింది. నర్సరీ విద్యార్థి స్కూల్‌లో తుపాకీతో హల్‌చల్ చేశాడు. ఓ విద్యార్థిపై కాల్పులకు తెగబడ్డాడు. చేతికి బుల్లెట్ తగలడంతో హుటాహుటినా పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో స్కూల్ యాజమాన్యంతో షాక్‌కు గురైంది. సుపాల్ జిల్లాలోని సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
తమిళనాడులోని ఆవడి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF)లో సెక్యూరిటీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన సర్వీస్ వెపన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మైలాడుతురై జిల్లా ముట్టపుదుపేట్‌కు చెందిన కాళిదాస్ (55)గా గుర్తించారు. అతనికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటన జూలై 24వ తేదీ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది.
జైపూర్ ట్రైన్ కాల్పుల ఘటనలో హైదరాబాద్ కు చెందిన సయ్యద్ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మంత్రి కేటీఆర్ కు ట్విటర్ ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు. జైపూర్-ముంబై ట్రైన్ కాల్పుల్లో హైదరాబాద్ నాంపల్లి బజార్‌ఘాట్ కు చెందిన సయ్యద్ సయూద్దీన్ మృతి చెందాడు