సరిగా ముప్పై ఐదేళ్ళ క్రితం వెంకటేశ్, అర్జున్, రాజేంద్రప్రసాద్ – ముగ్గురూ వర్ధమాన కథానాయకులుగా అలరిస్తున్నారు. వెంకటేశ్ అప్పుడప్పుడే ఆకట్టుకుంటున్నారు; అర్జున్ తనదైన యాక్షన్ తో అలరిస్తున్నారు; ఇక రాజేంద్రప్రసాద్ నవ్వుల పువ్వులు పూయిస్తూ సాగుతున్నారు. మరి ఈ క్రేజీ కాంబోలో సినిమా అంటే అది తప్పకుండా జనాన్ని ఇట్టే కట్టిపడేసేలా ఉండాలి కదా! అందుకోసం హిందీలో ఘనవిజయం సాధించిన ‘నసీబ్’ను ఎంచుకున్నారు నిర్మాతలు టి.సుబ్బరామిరెడ్డి, పి.శశిభూషణ్. వారి ‘మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్’ పతాకంపై తెరకెక్కిన తొలి…
హీరో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కోడి రామకృష్ణ, భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ .గోపాల్ రెడ్డి కలసి ‘మువ్వగోపాలుడు’తో హ్యాట్రిక్ సాధించారు. అంతకు ముందు ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన ‘మంగమ్మగారి మనవడు’ 560 రోజులు, ‘ముద్దుల క్రిష్ణయ్య’ 365 రోజులు ప్రదర్శితమై రికార్డు సృష్టించాయి. వీరి కలయికలో వచ్చిన మూడో చిత్రం ‘మువ్వగోపాలుడు’ సైతం 300 రోజులు ప్రదర్శితమయింది. ఇలా వరుసగా ముగ్గురు కలసి మూడు త్రిశతదినోత్సవాలు చూసిన ఘనత అప్పటి దాకా ఎవరికీ లేదు.…
విశాల నేత్రాలు, చక్కటి వర్చస్సు, చూడగానే చూపరులను ఆకట్టుకొనే రూపం, అందుకు తగ్గ అభినయం, ఆ రూపానికి తగిన లావణ్యం, దానిని ప్రదర్శిస్తూ సాగే నాట్యం అభినేత్రి శోభనను అందరి మదిలో చోటు సంపాదించుకొనేలా చేశాయి. మళయాళ సీమలో పుట్టినా, తెలుగు చిత్రసీమలో రాణించిన వారెందరో ఉన్నారు. వారిలో నటి, నర్తకి శోభన స్థానం ప్రత్యేకమైనది. తెలుగు చిత్రాలతోనే శోభన మంచి వెలుగు చూశారని చెప్పవచ్చు. నాట్యకళకే అంకితమై దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తూ నేడు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమను కరోనా పట్టి పీడిస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో స్టార్లు కరోనా బారిన పడుతుండడం అభిమానవులకు భయాందోళనలను కలిగిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా పలు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా సీనియర్ స్టార్ హీరోయిన్ శోభన ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. ”…
జీవితంలో అందరూ ఎంజాయ్ చేసే కామెడీ అంశాలతో హృదయానికి హత్తుకునేలా రూపొందిన మలయాళ ఎంటర్ టైన్ మెంట్ మూవీ ‘వరణే అవశ్యముంద్’. దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన ఈ చిత్రంలో సురేశ్ గోపి, శోభన, ఊర్వశి కీలక పాత్రలు పోషించారు. అనూప్ సత్యన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో ‘పరిణయం’ పేరుతో డబ్ చేసి, ఈ నెల 24 స్ట్రీమింగ్ చేస్తున్నారు. బుధవారం ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. గుండెను…