జీవితంలో అందరూ ఎంజాయ్ చేసే కామెడీ అంశాలతో హృదయానికి హత్తుకునేలా రూపొందిన మలయాళ ఎంటర్ టైన్ మెంట్ మూవీ ‘వరణే అవశ్యముంద్’. దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన ఈ చిత్రంలో సురేశ్ గోపి, శోభన, ఊర్వశి కీలక పాత్రలు పోషించారు. అనూప్ సత్యన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో ‘పరిణయం’ పేరుతో డబ్ చేసి, ఈ నెల 24 స్ట్రీమింగ్ చేస్తున్నారు. బుధవారం ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. గుండెను తాకేలా ఫీల్ గుడ్ మూమెంట్స్‌తో ఎంటర్‌టైనింగ్‌గా ‘పరిణయం’ మూవీ రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
పెద్దలు కుదిర్చిన వివాహాలు, సింగిల్ పేరెంట్ అయిన మహిళ ఎదుర్కొనే సమస్యలు, ఆమె మధ్య వయసులో ప్రేమను కోరుకోవడం .. ఇలా మన చుట్టూ చాలా మంది జీవితాల్లో ఉండే అనేక సమస్యలను గురించి తేలికైన పంథాలో తెలియజేస్తూ సాగే సినిమా ఇదని ట్రైలర్ ద్వారా దర్శకుడు చెప్పకనే చెప్పాడు. ఈ చిత్రానికి ఆల్ఫోన్స్ జోసెన్ సంగీతాన్ని, ముఖేష్ మురళీధరన్ సినిమాటోగ్రఫీని అందించారు.