ఉమ్మడి కడప జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. YS ప్రభంజనంలో చతికిలపడ్డ తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా కోలుకోలేదు. నాడు వైఎస్ చేతిలో.. రెండు దఫాలుగా జగన్ చేతిలో ఓడి.. షెడ్డుకు చేరింది సైకిల్. అప్పట్లో అధికారంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క సీటు గెల్చుకోలేకపోయింది టీడీపీ. 2004లో ప్రొద్దుటూరులో లింగారెడ్డి ఒక్కరే గెలిచారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ కేడర్ ఎక్కడికక్కడ సర్దుకుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కీలక పదవులు వెలగబెట్టిన వారంతా అధికారం దూరం…