మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. శివసేన ఎమ్మెల్యేలు ఆదివారం బాంద్రాలోని ఒక హోటల్‌లో సమావేశమయ్యారు. అక్కడ వారు శివసేన శాసనసభా పక్ష నేతగా ఏక్‌నాథ్ షిండేను తిరిగి ఎన్నుకున్నారు. ఉదయ్ సామంత్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏక్‌నాథ్ షిండేను మళ్లీ మహారాష్ట్ర సీఎంని చేయాలని శివసేన ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. శివసేన అధికార ప్రతినిధి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ మాట్లాడుతూ.. "మా కూటమి పెద్ద విజయం సాధించింది. ఏక్‌నాథ్…