Shirdi: షిర్డీలోని సాయిబాబా ఆలయానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)తో భద్రత కల్పించాలన్న ప్రతిపాదనపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఐఎస్ఎఫ్ భద్రతకు వ్యతిరేకంగా మే 1 నుంచి షిర్డీలో నిరవధిక బంద్‌కు దిగుతామని గ్రామస్తులు హెచ్చరించారు.
Shirdi: ఏపీలోని తిరుమల తర్వాత దేశంలో హుండీ ఆదాయం అధికంగా ఉన్న ఆలయం మహారాష్ట్రలోని షిర్డీ మాత్రమే. కరోనా తర్వాత ఆంక్షలు సడలించడంతో షిర్డీ సాయినాథుడిని దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో షిర్డీ సాయినాథునికి రికార్డు స్థాయిలో హుండీ కానుకలు వచ్చి చేరుతున్నాయి. గత ఏడాది అక్టోబర్ నుండి ఈ నవంబర్ వరకు బాబా సంస్థాన్‌కు రూ.398 కోట్ల కానుకలు వచ్చాయి. ఈ విషయాన్ని సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాగ్యశ్రీ బనాయత్ వెల్లడించారు.…
షిర్డీ సాయి భక్తులకు ఇది నిజంగా గొప్ప శుభవార్తే. ఇకపై సాయిబాబా దర్శనం కోసం షిర్డీ వెళ్లే భక్తులకు సాయి సంస్థాన్ గొప్ప భాగ్యాన్ని కలిగించింది. షిర్డీ సాయి సమాధిని స్పృశించే అవకాశం కల్పించింది.
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ మన దేశంలోనూ పలు రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబా ఆలయంపై ఒమిక్రాన్ ప్రభావం పడింది. మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధించడంతో అధికారులు ఆలయ వేళల్లోనూ మార్పులు చేశారు. షిర్డీ సాయిబాబా ఆలయాన్ని రాత్రి వేళ మూసివేస్తున్నట్టు షిర్డీసాయి సంస్థాన్ ఒక ప్రకటనలో తెలిపింది. Read Also: 2021: రివైండ్ – ప్రభావం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తున్న ఇద్దరు దర్శకులు క్రిష్ జాగర్లమూడి, హరీశ్ శంకర్ నవంబర్ 10వ తేదీ షిర్డీ లో సాయినాధుని దర్శించుకున్నారు. అంతే కాదు వీరితో ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం కూడా ఉన్నారు. షిర్డీలో వీరు దిగిన ఫోటోను ఆయనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విశేషం ఏమంటే… ఈ రోజున దర్శకుడు క్రిష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు చిత్రసీమలోని పలువురు ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు…
ఈరోజు నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం తెరుచుకోబోతున్నది. కరోనా కారణంగా ఏప్రిల్ 5 వ తేదీన ఆలయాన్ని మూసివేశారు. కరోనా ప్రస్తుతం తగ్గుముఖం పడుతుండటంతో తిరిగి ఆలయాన్ని తెరుస్తున్నారు. ప్రతిరోజూ 15 వేల మంది భక్తులకు మాత్రమే ప్రవేశం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 65 ఏళ్లు దాటినవారు, గర్భిణిలు, పదేళ్లలోపు చిన్నారులకు అనుమతులు లేవని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా పూర్తిస్థాయి కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని,…