పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తున్న ఇద్దరు దర్శకులు క్రిష్ జాగర్లమూడి, హరీశ్ శంకర్ నవంబర్ 10వ తేదీ షిర్డీ లో సాయినాధుని దర్శించుకున్నారు. అంతే కాదు వీరితో ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం కూడా ఉన్నారు. షిర్డీలో వీరు దిగిన ఫోటోను ఆయనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విశేషం ఏమంటే… ఈ రోజున దర్శకుడు క్రిష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు చిత్రసీమలోని పలువురు ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే క్రిష్ తీసిన ‘కొండపొలం’ సినిమా విడుదల కాగా, ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్నారు. ఈ ఎపిక్ మూవీకి ఎ.ఎం. రత్నం సమర్పకుడు కాగా, ఆయన సోదరుడు దయాకరరావు నిర్మాత. వచ్చే యేడాది ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే మరో దర్శకుడు హరీశ్ శంకర్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీ చేశాడు. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. మొత్తానికీ క్రిష్ పుట్టిన రోజున ఈ ముగ్గురూ సాయినాధుడిని దర్శించుకోవడం విశేషం!