Shirdi bandh: మే 1 నుంచి షిర్డీ బంద్.. సీఐఎస్ఎఫ్ భద్రతపై గ్రామస్తులు సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shirdi indefinite bandh: షిర్డీలోని సాయిబాబా ఆలయానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)తో భద్రత కల్పించాలన్న ప్రతిపాదనపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఐఎస్ఎఫ్ భద్రతకు వ్యతిరేకంగా మే 1 నుంచి షిర్డీలో నిరవధిక బంద్‌కు దిగుతామని గ్రామస్తులు హెచ్చరించారు. సాయిబాబా ఆలయానికి మరింత భద్రత కల్పించాలని సాయి సంస్థాన్ ట్రస్ట్ అధికారులు, మహారాష్ట్ర పోలీసులు నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఐఎస్ఎఫ్ జవాన్లతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని షిర్డీ గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు.
Read also: Salary Hike: సార్.. శాలరీ పెంచండి. లేకపోతే..
Also Read
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ప్రస్తుతం బాబా ఆలయ భద్రతను సాయి సంస్థాన్ సిబ్బంది, ఆలయ ప్రాంగణ భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూస్తున్నారు. ప్రతిరోజూ బాంబు స్క్వాడ్‌తో ఆలయాన్ని తనిఖీ చేస్తున్నారు. అయితే బాబా ఆలయ భద్రతపై సామాజిక కార్యకర్త సంజయ్ కాలే 2018లో బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఔరంగాబాద్ కోర్టు.. షిర్డీ సంస్థాన్ అభిప్రాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలో సాయి సంస్థాన్ సీఐఎస్‌ఎఫ్‌తో భద్రతకు మద్దతు పలికింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ షిర్డీ గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో గురువారం అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులు సమావేశమై మహారాష్ట్ర దినోత్సవమైన మే 1వ తేదీ నుంచి బంద్ పాటించాలని నిర్ణయించారు. అదే రోజు గ్రామసభ నిర్వహించి తదుపరి కార్యాచరణ తెలియజేస్తామని తెలిపారు. సాయిబాబా మందిరానికి సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించకూడదని, రాష్ట్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవిని రద్దు చేయాలని కోరారు.
డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ప్రాంతీయ అధికారితో కమిటీ వేసి షిర్డీ సాయిబాబా సంస్థాన్ ధర్మకర్తల మండలిని వీలైనంత త్వరగా నియమించాలని ప్రభుత్వం కోరుతోంది. షిర్డీ గ్రామస్థుల నుంచి 50 శాతం మంది ధర్మకర్తలను నియమించాలన్నారు. మరోవైపు గ్రామస్తులు సమ్మె చేసినా సాయిబాబా ఆలయాన్ని భక్తుల కోసం తెరిచి ఉంచుతామని సంస్థాన్ ట్రస్ట్ వెల్లడించింది. సాయిబాబా సంస్థాన్, సాయిబాబా ప్రసాదాలయం, క్యాంటీన్లలో భక్తుల వసతి కొనసాగుతుంది. భక్తులకు సాయిబాబా సంస్థానంలో అన్ని సౌకర్యాలు యథావిధిగా ఉంటాయన్నారు. అన్ని ఇతర వ్యాపారాలు పూర్తిగా మూసివేయబడతాయని తెలిపారు.
Tspsc paper leak: ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం.. విచారణ జూన్ 5కి వాయిదా
తాజావార్తలు
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!