Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈవెంట్లలో అభిమానుల జోష్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన పేరు విన్నా హాల్ కుదరదు, ఆ హంగామా చూస్తే ఎవరికైనా షాక్ వస్తుంది. తాజాగా యాంకర్ సుమ కనకాల ఈ విషయాన్నే గుర్తు చేసుకుంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు తాను శిల్పకలా వేదికలో రెండు సార్లు కిటికీలోంచి దూకి బయటకు వచ్చేశానని యాంకర్ సుమ తెలిపింది. ఆమె తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు…
CM Revanth Reddy : హైదరాబాద్‌లో శిల్పకళావేదికలో జరిగిన గ్రూప్-2 నియామక పత్రాల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి 783 మంది ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సచివాలయ అధికారులు రామకృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “నిస్సహాయకులకు సహాయం చేయడం మన బాధ్యత. తల్లిదండ్రులను, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం ప్రతి…
జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం వార్ 2. యశ్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే వార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అయింది. హృతిక్ రోషన్, టైగర్ షరాఫ్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు వార్ 2 తెరకెక్కించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో జూనియర్ ఎన్టీఆర్ పోరాడబోతున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది సినిమా యూనిట్. రిలీజ్‌కి…
తాజాగా శిల్పకళా వేదికలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఉదయం ఏఎం రత్నం గురించి మాట్లాడాను, ఇప్పుడు అభిమానుల గురించి మాట్లాడుతాను” అంటూ మొదలుపెట్టిన ఆయన, “తాను పడుతూ లేస్తూ ఉన్నానంటే దానికి కారణం అభిమానులే” అని, “పడినప్పుడు ఓదార్చి, లేచినప్పుడు అభినందిస్తూ తనకు అండగా నిలబడ్డారు” అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సమయంలో రీమేక్ సినిమాల గురించి ప్రస్తావిస్తూ, “ఎక్కువగా రీమేక్ చేస్తానని తిడతారు. కానీ ఏం చేయమంటారు, నా…
హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “సినిమాని ఆదరించి ఇష్టపడే ప్రతి ఒక్కరికి, టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, శిల్పకళా వేదిక నుంచి మా హృదయపూర్వక నమస్కారాలు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ ఫంక్షన్ హైదరాబాద్, తెలంగాణలో కనీసం లక్షలాది మంది మధ్య జరుపుకుందాం అని ప్లాన్ చేసినా, వర్షాభావాలు, ఇతర కారణాలవల్ల ముందుకు తీసుకెళ్లలేక ఫంక్షన్ సైజుని శిల్పకళా వేదికకు…
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకలా వేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు వచ్చిన బ్రహ్మానందం పవన్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ ఎలాంటి వ్యక్తి అనేది నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నాకు పవన్ కల్యాణ్ 15 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి తెలుసు. అప్పటి నుంచి చూస్తున్నాను. అతను ఎవరి దారిలో నడవడు.…
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏఎం రత్నం మాట్లాడుతూ, “నేను ఎన్నో సినిమాలు నిర్మించాను కానీ ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయ్యే మొట్టమొదటి సినిమా కాబట్టి నాకు ఈ సినిమా ఎంతో స్పెషల్. Also Read : HHVM : నైజాం ఫాన్స్ గెట్ రెడీ.. ప్రీమియర్స్ కి పర్మిషన్ వచ్చేసింది ! అంతేకాదు, ఖుషీ లాంటి సినిమా కాకుండా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది యూనిట్. హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు ఇరు రాష్ట్రల సినిమాటోగ్రఫీ మంత్రులు కూడా హాజరుకాబోతున్నారు. ఆ వేడుక లైవ్ ఇప్పుడు చూద్దాం.
హరిహర వీరమల్లు సందడికి అంతా సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే హరిహర వీరమల్లు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగబోతోంది. నిజానికి ఈ వేడుకను ముందు తిరుపతి లేదా విశాఖపట్నంలో నిర్వహించాలని అనుకున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇండోర్ ఈవెంట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించినప్పటికీ, 6:30 నుంచి 7:30 మధ్యలో కార్యక్రమం మొదలయ్యే అవకాశం ఉంది.…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో నేడు ‘అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వినియోగాన్ని కట్టడి చేసేందుకు…