దేశంలో వరకట్న చావులు ఎక్కువైపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. ఇటీవల కాలంలో నోయిడా, యూపీ, రాజస్థాన్‌లో.. ఇలా దేశంలో ఎక్కడొక చోట వరకట్న పిశాచికి బలైపోతున్నారు. తాజాగా బెంగళూరు, ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వరుస ఘటనలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.