Shikhar Dhawan: టీమిండియా స్టార్ బాట్స్మెన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నేడు ఈ విషయాన్ని తన X ఖాతా ద్వారా వీడియో రూపంలో తెలిపాడు. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ భావోద్వేగానికి గురి అయ్యాడు. భారతదేశం కోసం ఆడటం తన కల నిజమైందని, ఇప్పుడు తాను ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని., తనకు మద్దతుగా నిలిచిన తన కుటుంబానికి, చిన్ననాటి కోచ్ లకు, బీసీసీఐకి, డీడీసీఏకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.…