ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురికి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ఆగిఉన్న కారును మాధురి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధురికి గాయాలు కాగా.. పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మాధురిని విశాఖ ఆస్పత్రికి తరలించారు. కాగా.. పలాస ఆసుపత్రిలో చికిత్స తీసుకునేందుకు ఆమె నిరాకరించారు. చాలా సేపు బలవంతం చేసిన తర్వాత వైద్యులు చికిత్స అందించారు.
విశాఖపట్నంకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ అమరావతి రైతు పరిరక్షణ సమితి నేతలు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేసింది. దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థాయంలో అఫిడవిట్ దాఖలు చేసింది.