Sheetal Devi: ఆసియా పారా గేమ్స్ స్వర్ణ పతక విజేత, భారత పారా ఆర్చర్ శీతల్ దేవి శనివారం (సెప్టెంబర్ 27న) కొరియాలోని గ్వాంగ్జులో జరిగిన పారా ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో మరో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఉత్కంఠగా సాగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్లో టర్కీ స్టార్ క్రీడాకారిణి ఓజ్నూర్ క్యూర్ గిర్డిపై 146-143 తేడాతో విజయం సాధించి స్వర్ణం గెలుచుకుంది. ఈ టోర్నమెంట్‌లో శీతల్‌కు ఇది మూడో పతకం కావడం విశేషం. ఇంతకుముందు…
ఇండియాకు చెందిన ఆర్మ్ లెస్ ఆర్చర్ శీతల్ దేవి అరంగేట్రంలోనే అదరగొట్టింది. గురువారం జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి రెండవ స్థానంలో నిలిచింది. పారిస్ పారాలింపిక్స్‌లో 16వ రౌండ్‌లోకి నేరుగా ప్రవేశించింది.