Minister Seethakka : తెలంగాణలో అవినీతి దోపిడి చేసినవారిపై ఉక్కుపాదం మోపాలని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని బత్తులపల్లిలో పర్యటించిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో స్కీముల పేరుతో భారీ స్కామ్‌లు జరిగాయని ఆరోపించారు. గొర్రెల పంపిణీ పథకం కింద పేదల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన వారిని ముక్కుపిండి తిరిగి ఆ డబ్బులు రికవరీ చేస్తాం అంటూ సీతక్క ఘాటుగా స్పందించారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం…
ACB : తెలంగాణలో హల్చల్ రేపిన గొర్రెల పంపిణీ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏ1 మొయినుద్దీన్‌ను శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలోనే ఆయనపై లుక్‌ఔట్ నోటీస్ (LOC) జారీ చేయగా, హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారుల సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు అయినప్పటి నుంచీ మొయినుద్దీన్, ఆయన కుమారుడు ఈక్రముద్దీన్ పరారీలోనే ఉన్నారు. ఇద్దరి పాస్‌పోర్టులను అధికారులు ఇప్పటికే…
గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ అంజిలప్ప, ఏడీ కృష్ణయ్యలను అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ స్కామ్ లో నలుగురు అధికారులను అరెస్ట్ చేయగా.. తాజాగా మరో ఇద్దరిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.