ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. మంగళ్ హాట్ సీతారాం భాగ్ నుంచి ప్రారంభం కానున్న ఈ శోభాయాత్ర మధ్యాహ్నం 1 గంటకు ర్యాలీగా బయలుదేరనుంది. సీతారాం భాగ్ నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యయం శాలకు శోభాయాత్ర చేరుకోనుంది. మొత్తం 3.8 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో నగర పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు…
రాష్ట్రంలో మహిళల భద్రతపై తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులు, సిబ్బందితో ఆగస్టు 8వ తేదీ గురువారం నాడు డిజి (మహిళా భద్రత) తెలంగాణ శిఖా గోయెల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని 31 జిల్లాల నుంచి 300 మంది అధికారులు, సిబ్బంది సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. షీ టీమ్‌లు ఇప్పటివరకు రూపొందించిన ‘బలమైన భద్రతా అవగాహన’పై శిఖా గోయెల్ చాలా దృష్టి పెట్టారు. ఈవ్ టీజింగ్ కేసులు ఎక్కువగా నమోదయ్యే హాట్ స్పాట్‌లపై ప్రత్యేక దృష్టి…
Hyderabad: భాగ్యనగరంలో వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్ వంటి భారీ గణేశ మండపాల నిర్వాహకులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఉత్సవాలకు వచ్చే మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం, వేధించడం వంటిచి చేసిన 400 మందిపై కేసులు నమోదు చేశారని సీపీ ఆనంద్ వెల్లడించారు. పవిత్రమైన శోభాయాత్రకు కొందరు మద్యం తాగి వచ్చారని, అలాంటి వారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు కనుల పండువగా సాగుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో శ్రీరామనవమి వేడుకల్లో శోభకనిపిస్తోంది. వాడవాడలా శ్రీరాముడి కల్యాణం ఘనంగ నిర్వహించారు. శ్రీరామనవమి పేరు చెప్పగానే శోభాయాత్ర గుర్తుకువస్తుంది. సీతారాం బాగ్ నుండి మొదలైంది శోభాయాత్ర. ఆరున్నర కిలో మీటర్లు కొనసాగనుంది శోభాయాత్ర. టాస్క్ ఫోర్స్ , లా అండ్ ఆర్డర్ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. రెండేళ్ల తరువాత హైదరాబాద్ లో నవమి శోభాయాత్ర ప్రారంభం కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీతారాంబాగ్…
అభం శుభం తెలియని మైనర్ బాలికలు అన్యాయానికి గురవుతున్నారు. తెలిసి తెలియని వయస్సులో కొందరు తప్పుచేస్తే.. మరికొందరు మోసపూరిత మాటలకు బలైపోతున్నారు.. ఆర్దిక ఇబ్బందులు, సమాజం పట్ల అవగాహనా రాహిత్యం, ఆధునిక ప్రపంచం పట్ల మక్కువ, అరచేతిలో ఇంటర్ నెట్ బాలికలను చిన్న వయస్సులోనే మోసపోయేలా.. మరికొందరు తప్పుదారి పట్టేలా చేస్తుంది. మోసమైనా, మోజైనా అంతిమంగా బాలికలే నష్టపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న మైనర్ బాలికల అత్యాచార ఘటనలు సభ్య సమాజాన్ని…
ఆడవారిని రక్షించడానికి ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యలు తీసుకొంటుంది. అందులో భాగంగానే షీ టీమ్స్, దిశా యాప్స్.. ఆడవారిని హింసిస్తే కఠిన చర్యలు తప్పవని ప్తభుత్వం నిక్కచ్చిగా తెలిపింది. మహిళలు తమకు ఎటువంటి సమస్య ఎదురైనా షీ టీమ్స్ కి కాల్ చేసి చెప్పవచ్చు. ఐతే గత కొన్ని రోజులుగా షీ టీమ్ కి మహిళలు తమను వేధిస్తున్నారని వారి భర్తలు ఫిర్యాదు చేయడం చర్చానీయాంశంగా మారింది. తాజాగా ఒక భర్త తన భార్య విడాకులు ఇవ్వమంటూ…
తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో మహిళల భద్రత కోసం షీ టీంలు పనిచేస్తున్నాయి. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న వేధింపులను నియంత్రించడానికి సైబర్ ల్యాబ్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీని ద్వారా సెల్ఫోన్ల ద్వారా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌తో వేధించే వారిని ఈ సైబర్‌ల్యాబ్ పసిగడుతుంది. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లకు ఈ ల్యాబ్ సాంకేతిక సహాయాన్ని అందజేయనుంది.…