తెలంగాణ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్ధుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో పిల్లల భద్రత, రక్షణకు పటిష్ట మార్గదర్శకాలు రూపకల్పనకై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ భేటీ జరిగింది. వివిధ భాగస్వాములతో త్రిసభ్యకమిటి సంప్రదింపులు జరిపింది. త్రిసభ్య కమిటి చైర్ పర్సన్ సీనియర్ IAS అధికారిణి రాణి కుముదిని సమావేశాన్ని ప్రారంభించారు. త్రిసభ్య కమిటీ చైర్ పర్సన్ సీనియర్ IAS అధికారి రాణి కుముదిని మాట్లాడుతూ.. చిన్నారుల రక్షణ మరియు భద్రత మనందరి బాధ్యత అన్నారు. ఇకపై అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటానికి పటిష్ట మార్గదర్శకాలు రూపొందించుటకు విలువైన నిర్దిష్టమైన సలహాలను సూచనలను ఇవ్వాలన్నారు.
డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగంలో టెక్నాలజీ పరంగా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుటకు వారి భద్రత మరియు రక్షణ ముఖ్యమైన అంశంగా సంతరించుకుందన్నారు. పిల్లలు తిరిగేచోట పరిసరాలను కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. ఏదైనా సంఘటన జరగక ముందే మేలుకునేలా ఉండాలని, ఒకవేళ ఏదైనా జరిగినా వెంటనే చెప్పగలిగేలా Mentor Teachers చొరవ తీసుకోవాలన్నారు. చిన్నారుల రక్షణ మరియు భద్రత మనందరి బాధ్యత అని ఇకపై అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటానికి పటిష్ట మార్గదర్శకాలు రూపొందించుటకు విలువైన నిర్దిష్టమైన సలహాలను సూచనలను అందించవలసినదిగా భాగస్వాములను కోరారు.
విద్యారంగంలో టెక్నాలజీ పరంగా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్న క్రమంలో పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుటకు వారి భద్రత మరియు రక్షణ ముఖ్యమైన అంశంగా సంతరించుకుందని ఆ క్రమంలో వివిధ భాగస్వాములను సాధికారులను చేయడం ఒక ముఖ్యమైన భాగమన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి.యాజమాన్యాల బాధ్యత రెండవ భాగమని ఒక వ్యవస్థీకృత చట్రంలో మార్గదర్శకాల రూపకల్పన ఉండాలని సూచించారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ పిల్లల రక్షణ మరియు భద్రత మన బాధ్యతగా భావించి ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా పోలీసు డిపార్టుమెంట్ సమన్వయంతో అందరూ భాగస్వాములు కావాలసినదిగా కోరారు.
Read Also: SSMB28: త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్.. బాలీవుడ్ స్టార్ నటి రంగంలోకి?
షీటీమ్స్ DIG సుమతి మాట్లాడుతూ.. ఇటీవల సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది… పిల్లలు ఫిర్యాదు చేసిన వెంటనే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పిల్లలు ఎలాంటి సంకోచాలు లేకుండా వివరాలు అందచేయాలన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన కమిటీ ఉద్దేశ్యాలను వివరించే ప్రయత్నం చేశారు. పిల్లల శ్రేయస్సు, రక్షణ అనేది సామాజిక బాధ్యతగా భావించి అందరూ భాగస్వాములై బాధ్యత వహించాలన్నారు.
పిల్లల శ్రేయస్సు, బాధ్వత అనేది. సామాజిక బాధ్యతగా భావించి అందరూ భాగస్వాములై బాధ్యత వహించాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల విద్యాశాఖాధికారులు, అదనపు సంచాలకులు, సంయుక్త సంచాలకులు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు NALSAR యూనివర్సిటీ. National Institute of Mental Health and Neurosciences (NIMHANS) ప్రతినిధులు, మరియు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: FIFA World Cup Final: రికార్డ్ క్రియేట్ చేసిన గూగుల్..