Shashi Tharoor: పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న ఉగ్రవాదం గురించి ప్రపంచ వ్యాప్తంగా ఎండగట్టడానికి భారత్ అఖిలపక్షంతో కూడి ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది. దేశంలోని పలు పార్టీలకు చెందిన ఎంపీలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఎలా మద్దతు ఇస్తుందనే అంశాన్ని విదేశాలకు వీరు చెప్పనున్నారు. అయితే, ఇప్పుడు ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ని ఎంపిక చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారం థరూర్, కాంగ్రెస్ మధ్య విభేదాలను స్పష్టంగా చూపిస్తుంది.
ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, ఈ అంశంపై భారత్ వైఖరిని వివరించడానికి కీలకమైన విదేశీ దేశాలను సందర్శించడానికి భారత ప్రభుత్వం ఏడుగురు సభ్యుల అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ కూడా ఉన్నారు. తిరువనంతపురం నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన శశి థరూర్ ఈ అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇతర నామినేటెడ్ సభ్యులలో బిజెపి నాయకులు…