ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కొత్త హిస్టరీ క్రియేట్ చెయ్యడానికి యష్ రాజ్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఇటివలే పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన మేకర్స్, ఈసారి వరల్డ్ బాక్సాఫీస్ నే టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నారు. షారుఖ్ నటించిన పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ తో క్యామియో ప్లే చేయిస్తేనే వెయ్యి కోట్లు వచ్చాయి… ఇక ఇద్దరినీ కలిపి ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది…
షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మెయిన్ పిల్లర్స్ లాంటి వాళ్లు. ‘కరణ్-అర్జున్’, హమ్ తుమ్హారే హై సనమ్’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’, ‘ఓం శాంతి ఓం’, ‘ట్యూబ్ లైట్’, ‘జీరో’ లాంటి సినిమాల్లో కలిసి కనిపించిన ఈ ఇద్దరు హీరోల కెరీర్ గ్రాఫ్ దాదాపు ఒకేలాగే ఉంటుంది. ప్రొఫెషనల్ రైవల్రీనే కాదు, పర్సనల్ రైవల్రీని కూడా దశాబ్దాల పాటు మైంటైన్ చేశారు షారుక్, సల్మాన్.…