'రైటర్ పద్మభూషణ్' చిత్ర బృందాన్ని కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అభినందించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి లభిస్తున్న స్పందన పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
'ది బేకర్ అండ్ ది బ్యూటీ' వెబ్ సీరిస్ లో నటించిన టీనా శిల్పరాజ్ ఇప్పుడు 'రైటర్ పద్మభూషణ్' మూవీతో వెండితెరకు పరిచయం అవుతోంది. ఈ మూవీ ప్రేక్షకులకు ఓ ఎమోషనల్ రైడ్ లా అనిపిస్తుందని టీనా చెబుతోంది.