డ్రగ్స్ కేసులో దాదాపు 26 రోజులు జైలులో గడిపిన ఆర్యన్ ఖాన్ ఈరోజు బెయిల్ పై విడుదలై జైలు నుంచి బయటకు వచ్చారు. ఆర్యన్ తో పాటు ఆయన స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, మోడల్ మున్మున్ ధమేచా కూడా ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చారు. క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసులో వీరందరినీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అక్టోబర్ 3న అరెస్టు చేసింది. ముగ్గురిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద కేసు నమోదు చేశారు. వీరితో పాటు మరో 20 మందిని కూడా అరెస్ట్ చేశారు ఎన్సీబీ అధికారులు.
14 బెయిల్ షరతులతో కూడిన ఐదు పేజీల బెయిల్ ఆర్డర్‌ను బాంబే హైకోర్టు జారీ చేసింది. బెయిల్ కోసం ష్యూరిటీగా రూ.లక్ష బాండ్ తో పాటు ఒకరి హామీని కూడా తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. న్యాయవాది సతీష్ మనేషిండే ఆర్యన్ బెయిల్ కేసును వాదించగా, నటి జుహీ చావ్లా ఆర్యన్‌కు ష్యూరిటీ ఇచ్చారు. మరోవైపు ఆయన స్నేహితులకు ఎలాంటి ష్యూరిటీ అడగలేదు కోర్టు. అయితే బెయిల్ మంజూరుతో పాటు కోర్టు పెట్టిన షరతులకు సంబంధించి, బెయిల్ ఆర్డర్ ప్రకారం ముగ్గురు నిందితులు ప్రతి శుక్రవారం ఎన్సీబీ ముంబై కార్యాలయంలో హాజరు కావాలి. ఎన్డీపీఎస్ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లేందుకు వీల్లేదు. దీంతో పాటు తన పాస్‌పోర్టును వెంటనే ఆర్యన్ ప్రత్యేక కోర్టుకు అప్పగించాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశం ప్రకారం ఆర్యన్ సహ నిందితులతో టచ్‌లో ఉండకూడదు.
Read Also : జైలు నుంచి ఆర్యన్ ఖాన్ రిలీజ్
14 బెయిల్ షరతులు ఇవే :