రాజ్ కుమార్ హిరానీ చిత్రంలో షారుఖ్ సరసన తాప్సీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘జీరో’ మూవీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొద్ది రోజులు నటనకు దూరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కింగ్ ఖాన్ ‘పఠాన్’ మూవీ చేస్తున్నాడు. దీనితో పాటు షారుఖ్ ఖాన్.. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మూవీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమా షూటింగ్ ఈ యేడాది మార్చిలో ముంబైలో మొదలవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ముంబై ఫిల్మ్ సిటీ స్టూడియోలో ఓ భారీ పంజాబ్ విలేజ్ సెట్ ను త్వరలో నిర్మించబోతున్నారని సమాచారం. మూవీ అత్యధిక భాగం చిత్రీకరణ ఈ విలేజ్ సెట్ లో జరుగుతుందని, ఆ తర్వాత లండన్, బుడాపెస్ట్ లో కొంత షూటింగ్ చేస్తారని అంటున్నారు.
Read Also : తలైవా కంటే ఎక్కువ ఫాలోయింగ్… సౌత్ లో అత్యధికంగా ఫాలో అవుతున్న స్టార్
Also Read
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
షారుఖ్ ఖాన్ ‘జీరో’లో కత్రినా కైఫ్, అనుష్క శర్మ నటించారు. ఇక ‘పఠాన్’లో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంటే, జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలానే మార్చిలో మొదలు కాబోతున్న రాజ్ కుమార్ హిరానీ మూవీలో అన్నీ అనుకూలిస్తే… తాప్సీ నాయికగా నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవల ఈ విషయాన్ని తాప్సీని అడిగితే, చర్చలు జరుగుతున్నాయని, ఒకసారి ఫైనలైజ్ అయితే తానే అధికారికంగా ప్రకటిస్తానని చెప్పింది. అయితే… ఇప్పటి వరకూ ఇటు షారుక్, అటు రాజ్ కుమార్ హిరానీ మనసులో తాప్సీనే ఉందని తెలుస్తోంది. సో… కింగ్ ఖాన్ కు తాప్సీ లక్కీఛార్మ్ గా మారుతుందేమో చూడాలి!
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!