Doctor Suicide: మహారాష్ట్ర సతారాలో వైద్యురాలి ఆత్మహత్య ఘటన దేశంలో సంచలనంగా మారింది. 26 ఏళ్ల లేడీ డాక్టర్ తన మరణానికి కారణం ఓ ఎస్సై అని పేర్కొంటూ, తన చేతిపై సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేసుకుంది. ఫల్తాన్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్య అధికారిగా ఉన్న వైద్యురాలు, గురువారం రాత్రి ఉరి వేసుకుని మరణించింది. ఎస్ఐ గోపాల్ బద్నే తనపై 5 నెలల్లో నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది.
Bengaluru: బెంగళూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ ఇంజనీర్ కాలేజ్ క్యాంపస్‌లో సీనియర్ విద్యార్థినిపై, మరో స్టూడెంట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని జీవన్ గౌడగా గుర్తించారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, నిందితుడితో ఆమెకు మూడు నెలల పరిచయం ఉంది. కాలేజీలో ఇద్దరూ కూడా ఒకే డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారు.
లైంగిక దాడి కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఇంటి పనిమనిషి దాఖలు చేసిన అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు రుజువు కావడంతో 14 నెలల తర్వాత దోషిగా తేలుస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
పూణే కోంధ్వా ప్రాంతంలోని ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. కొరియర్ డెలివరీ బాయ్‌గా నటిస్తూ ఓ ఫ్లాట్‌లోకి ప్రవేశించిన వ్యక్తి 22 ఏళ్ల యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన బుధవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.
ముంబైలోని ఒక ప్రముఖ పాఠశాలకు చెందిన 40 ఏళ్ల ఇంగ్లీష్ టీచర్ తన 16 ఏళ్ల విద్యార్థిపై ఏడాది పాటు లైంగిక వేధింపులకు పాల్పడింది. ప్రస్తుతం ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మహిళ మైనర్ బాలుడిని ముంబైలోని వివిధ ఫైవ్ స్టార్ హోటళ్లు, ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లి, మద్యం తాగించేదని తేలింది. నిరోధక మాత్రలు సైతం ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడిందని బాధితుడు పేర్కొన్నాడు.
Rayapati Sailaja: అనంతపురం జిల్లా రామగిరిలో మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఘటనా ప్రాంతాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా ఓ మైనర్ బాలికపై లైంగిక దాడులు జరుగుతున్నాయని విచారకరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా “కాలం బాగోలేదు… అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా అనుమానాలు ఉంటే తల్లిదండ్రులకు చెప్పాలి” అంటూ ఆమె…
Supreme Court: ఇటీవల పోక్సో కేసు విచారణ సందర్భంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైంది. ‘‘వక్షోజాలను పట్టుకోవడం, పైజామా దారాలు తెంచడం అత్యాచారం లేదా అత్యాచారయత్నం కాదు’’అని హైకోర్టు వ్యాఖ్యానించింది. కానీ ఈ చర్యల్ని తీవ్రమైన లైంగిక దాడిగా పరిగణిస్తామని చెప్పింది. జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రాతో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే, ఈ వ్యాఖ్యలపై మహిళలతో పాటు సమాజం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
Bandi Sanjay : ఎంఎంటీఎస్ నుండి దూకి గాయాలపాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి కుటుంబ సభ్యులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఫోన్ లో పరామర్శించారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే ఆ యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన…
Allahabad HC: లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ(పోక్సో) కేసును విచారిస్తున్న సందర్భంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలి వక్షోజాలను పట్టుకోవడం, ఆమె పైజామా తాడు తెంచడం అత్యాచారం లేదా అత్యాచార యత్నం కాదని చెప్పింది. కానీ, ఇది తీవ్రమైన లైంగిక దాడిగా పరిగణించబడుతుందని హైకోర్టు పేర్కొంది. కాస్గంజ్ లోని ప్రత్యేక న్యాయమూర్తి పోక్సో కోర్టు సమన్ల ఉత్తర్వులను జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రాతో కూడిని సింగిల్ బెంచ్ సవరించి, కొత్త సమన్లు…
తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్.రవిని బీజేపీ మహిళా నేతలు కలిశారు. అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు.