ఏపీలో ఎండలు దంచి కొడుతున్నాయి. జనం ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. ముఖ్యంగా ఉదయం పదిగంటలు దాటిన తర్వాత భానుడి భగభగలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడుగా.. తీవ్రమైన వడగాల్పులు కూడా వీస్తాయని తెలిపింది. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రేపు (సోమవారం) 72 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 200 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల…