మేడ్చల్ జిల్లా శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం... తెలంగాణలోనే అత్యంత ఖరీదైన సెగ్మెంట్. ఐటీ సెక్టార్ విస్తరించిన ఏరియా. అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతం. అలాంటి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమైంది.
Hyderabad: హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి ప్రాంతంలో మానవత్వాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నడిరోడ్డుపై గర్భవతిగా ఉన్న భార్యను భర్తే బండరాయితో పలుమార్లు కొట్టి హత్యకు యత్నించిన ఘటన స్థానికులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ ఘటన శేరిలింగంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే వికారాబాద్‌కు చెందిన ఎండీ బస్రత్ (32), షబానా పర్వీన్ (22) దంపతులు హఫీజ్‌పేట్ ఆదిత్యనగర్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం షబానా రెండు నెలల గర్భిణి.…
HYDRA : అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణం కూల్చివేత చేపట్టి 5 అంతస్తుల భవనం నేల మట్టం చేసింది. అయితే దీనిపై హైడ్రా ప్రకటన విడుదల చేసింది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజీలోని అయ్యప్ప సొసైటీ సర్వే నంబరు 11/5 లో ప్లాట్ నంబరు 5/13 పేరిట 684 గజాలలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చివేసింది హైడ్రా.. ఈ కూల్చివేతలో స్థానిక పోలీసులతో పాటు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. జీహెచ్ ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను…
చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పిస్తే.. కేంద్రంలోని మోడీ సర్కారు బాధలు ఫ్రీగా కల్పిస్తుందని అన్నారు.
Revanth Reddy: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. ప్రతి రోజూ నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం, రోడ్ షోలు కొనసాగుతున్నాయి.
మహిళల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ చెప్పారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని తారా నగర్‌లో జగదీశ్వర్ గౌడ్ ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనని గెలిపించాలని ప్రజలను కోరారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించిన ఆరు గ్యారంటీలు తనని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని జగదీశ్వర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండాపూర్ డివిజన్లోని హాఫీజ్ పేట, ప్రేమ్ నగర్, మార్తాండ్ నగర్ లలో ఆయన ఇంటికి తిరుగుతూ తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి బీజేపీలో కుమ్ములాటలు రచ్చకెక్కాయి. రెండు వర్గాలకు చెందిన నియోజకవర్గ స్థాయి బీజేపీ నాయకులు, కార్పొరేటర్ అనుచరులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ రోడ్డున పడటం చర్చగా మారింది. గోపన్‌పల్లి రహదారిపై ఘర్షణకు దిగడంతో పార్టీలోని అంతర్గత విభేదాలు అందరికీ తెలిసిపోయింది. అసెంబ్లీ బీజేపీ ఇంఛార్జ్ గజ్జెల యోగానంద్‌తో సహా పలువురు నాయకులు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డితో జరిగిన వాగ్వాదం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గం బీజేపీలో మూడు గ్రూపులు…
హైదరాబాద్ లోని శేరిలింగంపల్లిలో భారతీయ జనతా పార్టీ నేతలపై దాడి జరిగింది. గోపన్‌పల్లి ప్రాంతంలో ఓ చెరువు స్థలాన్ని కబ్జా వ్యవహారంలో ఈ ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తోంది.. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నేతలు గజ్జల యోగానంద్, మువ్వా సత్యనారాయణలు తమ అనుచరులతో కలిసి గోపన్‌పల్లి వెళ్లగా.. స్థానికులు వారిపై దాడి చేశారు. బీజేపీ నేతలు చెరువును ఫొటోలు తీస్తుండగా.. స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.. కబ్జాకు గురైన చెరువు అది…