తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు రోజుల సమయం ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించిన ఆరు గ్యారంటీలు తనని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని జగదీశ్వర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండాపూర్ డివిజన్లోని హాఫీజ్ పేట, ప్రేమ్ నగర్, మార్తాండ్ నగర్ లలో ఆయన ఇంటికి తిరుగుతూ తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
Read Also: Saindhav: వెంకీ మామ బాగా చెప్పాడు కానీ, అది సెట్ అవ్వలేదే
తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. అందు కోసమే ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల తీరును గమనిస్తున్న ప్రజలు కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తనకు మద్దతు ప్రకటించడం ఆనందంగా ఉందని తన గెలుపు తద్యమని జగదీశ్వర్ గౌడ్ చెప్పారు. ప్రచారంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు జగదీశ్వర్ గౌడ్ పై పూలు చల్లుకుంటూ స్వాగతం పలికారు.