Stock Market Today : 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న స్టాక్ మార్కెట్‌కు ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి. 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ఓట్ల లెక్కింపు ప్రారంభమైన 1 గంట తర్వాత ఎన్డీయే కూటమి తొలి ట్రెండ్స్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఎగ్జిట్ పోల్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి చారిత్రాత్మక విజయం సాధిస్తారని అంచనా వేసిన తర్వాత భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 సోమవారం రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి.
ఐదు రోజుల వరుస నష్టాల తర్వాత శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 525 పాయింట్ల లాభంతో 74,410 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడి 22,619 దగ్గర కొనసాగుతోంది.
వచ్చే వారం వెలువడనున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు శ్రీకారం చుట్టడంతో మంగళవారం భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ లు నష్టాల్లో ముగిశాయి. మంగళవారం సెన్సెక్స్ 220 పాయింట్లు నష్టపోయి 75,170 పాయింట్స్ వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 22,888 పాయింట్స్ వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 466 పాయింట్లు నష్టపోయి 52,294 వద్ద ముగియగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 144 పాయింట్లు క్షీణించి 16,875…
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభం కాగా.. ముగింపు కూడా స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 7 పాయింట్లు నష్టపోయి.. 75,410 దగ్గర ముగియగా.. నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 22,957 దగ్గర ముగిసింది.
స్టాక్ మార్కెట్లు కొత్త రూపు సంతరించుకున్నాయి. మునుపెన్నడూ లేనంతగా గురువారం సూచీలు లాభాల్లో దూసుకుపోవడం ఆర్థిక నిపుణులకు ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే ముందే ఈ స్థాయిలో లాభాల్లో దూసుకుపోవడం సరికొత్త ఒరవడిని సృష్టించింది. ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ ప్రారంభం నుంచి ఊహించని రీతిలో లాభాల్లో దూసుకెళ్లాయి. ఇక నిఫ్టీ అయితే ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. 369 పాయింట్లు లాభపడి.. 22, 967 దగ్గర ముగిసింది.…
గురువారం భారీగా పతనమైన దేశీయ సూచీలు శుక్రవారం కాస్త కోలుకున్నాయి. 1,000 పాయింట్లకు పైగా నష్టపోయి ఇన్వెస్టర్లకు నష్టాలను చవిచూపించిన సెన్సెక్స్ శుక్రవారం కాస్త ఊరటనిచ్చింది. ఇన్వెస్టర్లు కనిష్ట స్థాయిల్లో కొనుగోళ్లకు దిగడంతో సూచీలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు, అధిక వెయిటెడ్ స్టాక్స్ లాభపడటంతో సెన్సెక్స్ స్వల్పంగా పెరిగింది. Also Read: Team India: టీమిండియాలో పునరాగమనం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన బౌలర్.. సెన్సెక్స్ శుక్రవారం ఉదయం 72,475 వద్ద…
నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1062.22 పాయింట్లతో 1.45 శాతం తగ్గి 72,404.17 వద్దకు చేరుకుంది. నిఫ్టీ కూడా 335.40 పాయింట్లతో 1.5 శాతం క్షీణించి 21,967.10 వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. ఓవైపు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వచ్చినప్పటికీ., ఇండెక్స్ గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో ఇన్వెస్టర్లు లాభాలను తీసుకోవాలనుకున్నారు. దాంతో ముక్యంగా హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ అమ్మకాలు ఎక్కువగా జరగడంతో.. సెన్సెక్స్ ఒక దశలో 600 పాయింట్లకు పైగా నష్టపోయినా., ఆ తర్వాత కాస్త కోలుకొని చివరకి నిఫ్టీ 22,300 పాయింట్లను తాకింది. Also Read: Sai Pallavi : కోట్లు…