సీనియర్లు పార్టీకి కాపలా కాశారని.. సీనియర్ల సహకారం పార్టీకి అవసరమని మంత్రి నారాలోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి లోకేశ్ ప్రసంగించారు. ఎన్నికల్లో గెలుపు వెనుక కార్యకర్తల కష్టం ఉందని గుర్తు చేశారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కష్టపడాలన్నారు. మంచి పనులు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేశారు. 151 సీట్లు 11 అయ్యాయంటే దానికి కారణం వారి అహంకారమని విమర్శించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా…
అనంతపురం జిల్లాలోని టీడీపీ సీనియర్లలో టికెట్ టెన్షన్ నెలకొంది. సీనియర్లు, జూనియర్లు లేరని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీట్ల కేటాయింపునకు సర్వేలే కీలకం అని చెప్పుకొచ్చారు. త్యాగాలకు సిద్దంగా ఉండాలని సూచన చేసినట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్మలాటలు, నేతల మధ్య వర్గపోరు, అవి బహిర్గతం అవ్వడం.. ఆ తర్వాత సర్దుకుపోవడం.. ఎన్నికల సమయంలో కలిసి పనిచేయడం.. కొన్ని సార్లు మంచి ఫలితాలు వస్తే.. మరికొన్ని సార్లు నష్టపోవడం.. చూస్తూనే ఉన్నాం.. అయితే, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త కమిటీల నియామకం చిచ్చుపెడుతోంది.. కొత్త కమిటీల్లో ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలను పక్కనబెట్టి.. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి..…
వారంతా ఒకప్పుడు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. జిల్లాను కనుసైగతో శాసించారు కూడా. మారిన రాజకీయాలు ఒంటబట్టలేదో.. ఉన్న పార్టీలలో ప్రాధాన్యం తగ్గిందో కానీ.. పొలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు. వారెవరో ఇప్పుడు చూద్దాం. వర్తమాన రాజకీయాల్లో ఒంటరి ప్రయాణం! ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఉద్ధండులైన రాజకీయ నేతలకు కేరాఫ్ అడ్రస్. ఉమ్మడి రాష్ట్రంలో వారి పేరు ప్రస్తావన లేకుండా పొలిటికల్ డిస్కషన్స్ ఉండేవి కావు. కాలం కలిసి రాలేదో.. మారిన రాజకీయాలకు అడ్జెస్ట్ కాలేకపోయారో కానీ..…
ఆ మధ్య వరుసగా కేంద్ర మంత్రులు, బీజేపీ టాప్ లీడర్లకు షాకిచ్చిన సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. ఇప్పుడు ఫోకస్ కాంగ్రెస్ నేతలపై పెట్టినట్టు కనిపిస్తోంది.. ఎందుకంటే.. మొన్నటి మొన్న రాహుల్ గాంధీ ఖాతాను లాక్ చేసిన ట్విట్టర్.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతాను.. ఆ పార్టీకి చెందిన మరో ఐదుగురు నేతల అకౌంట్లను నిలిపివేసింది.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అజయ్…
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకులకు పార్టీలో కీలక పదవులు ఇచ్చే ఆలోచనలో పీసీసీ ఉన్నట్టు తెలుస్తుంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కొన్ని ప్రధానమైన అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణలో ఒక పార్టీ నుండి… ఇంకో పార్టీకి వలసలు సహజమయ్యాయి. అయితే, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారిని కూడా కలుపుకుని పోవాలని రేవంత్ భావిస్తున్నారు. దీంట్లో భాగంగా పార్టీలోకి నాయకులను ఆహ్వానించే పనిలో పడ్డారు. పార్టీలోకి ఎవరిని…