హమాస్ అంతమే లక్ష్యంగా జరిగిన యుద్ధంలో ఐడీఎఫ్ ఎన్నో ఘన విజయాలను సాధించింది. కీలక అగ్ర నేతలందరినీ మట్టు్బెట్టించింది. హమాస్ అగ్ర నేత హనియే, హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా లాంటి ఖ్యాతి గడించిన నాయకులందరినీ ఇజ్రాయెల్ అంతం చేసింది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ నిరంతరం గాజాపై బాంబు దాడులు చేస్తూనే ఉంది. ఇదిలా ఉండగా.. వెస్ట్ బ్యాంక్ నగరంలోని అరూరాలోని సీనియర్ హమాస్ అగ్రనాయకుడు సలేహ్ అల్-అరౌరీ ఇంటిని కూల్చివేసింది. . ఈ నాయకుడి పేరు సలేహ్ అల్-అరూరి. అతను హమాస్ పొలిటికల్ బ్యూరో డిప్యూటీ చీఫ్, వెస్ట్ బ్యాంక్‌లో హమాస్ మిలిటరీ కమాండ్ నాయకుడు.