Balti: షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్ తో పాటు ప్రేమమ్ డైరెక్టర్ ఆల్పాన్స్ పుదిరన్ ప్రధాన తారాగణంగా ఉన్ని శివలింగం దర్శకత్వంలో తమిళ, మలయాళ భాషల్లో ఘన విజయం సాధించిన ‘బల్టీ’ చిత్రం తెలుగులో అక్టోబర్ 10న విడుదలవుతోంది. కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రాజకీయాలు, గ్యాంగ్ స్టర్ కథలతో కలిపి వైవిధ్యంగా రూపొందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎల్మా పిక్చర్స్ సంస్థ విడుదల చేస్తోంది. మరో బిగ్ సేల్…
త్రిష ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు లో దాదాపు అందరి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.టాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. అలాగే తమిళ్ ఇండస్ట్రీ లో కూడా ఈ భామ స్టార్ హీరోయిన్ గా రానించింది. తాజాగా ఈ భామ పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది.రెండు పార్ట్స్ గా తెరకెక్కిన ఆ సినిమా సూపర్ హిట్…
తమిళ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’ ఆయన కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆయన అభిమానులను సైతం నిరాశపరిచిన ఈ సినిమా ‘కెజిఎఫ్2’ దెబ్బకి అడ్రెస్ లేకుండా పోయింది. ‘కొలమావు కోకిల’, ‘డాక్టర్’ సినిమాల దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రిలీజ్ కి ముందు పాటలు హిట్ కావటంతో పుల్ హైప్ క్రియేట్ చేసింది. అయితే రిలీజ్ తర్వాత తుస్సుమనిపించింది. రిలీజ్ తర్వాత సినిమా ప్లాఫ్…
ధనుష్ హీరోగా కొత్త సినిమా ఆరంభం అయింది. చాలా కాలం తర్వాత తన అన్న సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో ధనుష్ విజయంలో కీలక పాత్ర పోషించారు సెల్వరాఘవన్. ‘తుల్లువదో ఇళమై’, ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ వంటి హిట్ సినిమాలు వీరిద్దరి కలయికలో వచ్చాయి. ఇప్పుడు ధనుష్ తో ‘అసురన్’, ‘కర్ణన్’ వంటి సినిమాలు తీసిన వి క్రియేషన్స్ అధినేత కలైపులి ఎస్ థాను సెల్వరాఘవన్ దర్శకత్వంలో మరో సినిమా మొదలు పెట్టారు.…
ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ సైతం నటుడిగా మారిపోయాడు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించాడు సెల్వరాఘవన్. తెలుగులోనూ వెంకటేశ్ హీరోగా ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించాడు. సెల్వ రాఘవన్ తమ్ముడు ధనుష్ ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజానికి సెల్వ రాఘవన్ తాను నటుడిగా మారుతున్నట్టు గత యేడాది డిసెంబర్ లోనే ప్రకటించాడు. ‘రాకీ’ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న…