ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌కు తెలంగాణ నుంచి క్రికెటర్లు జి.త్రిష, కె.ధ్రుతి ఎంపికయ్యారు. ఈ క్రమంలో వారిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఘనంగా సన్మానించింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో ఈ ఇరువురుని హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్‌రావు ప్రత్యేకంగా అభినందించారు.
రేపు బంగ్లాదేశ్‌తో మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవవన్‌ని మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఎంపిక చేశాడు. తన జట్టులో ఎవరిని చేర్చుకున్నాడో దినేష్ కార్తీక్ వెల్లడించాడు.
వెస్టిండీస్ లో ఆగష్టు 22 నుంచి 30 వరకు జరగనున్న మహిళల కరీబియన్ ప్రీమిమర్ లీగ్ (సీపీఎల్) టోర్నమెంట్ లో హైదరాబాద్‌కు చెందిన మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర ఎంపికైంది. ప్రణవి చంద్ర ఆతిథ్య ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తరుఫున ఆడేందుకు ఎంపికైంది. ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు.
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆటగాళ్లు ఎవరు ఆడితే బాగుందనే అంచనా వేస్తున్నారు టీమిండియా మాజీ ఆటగాళ్లు. ఇప్పటికే పలువురు మాజీ ప్లేయర్లు తమ అంచనాను తెలియజేశారు. తాజాగా.. హర్భజన్ సింగ్ కూడా తన అంచనా తెలియపరిచాడు. టీ20 వరల్డ్ కప్ కోసం ఆడే తన 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఆయన సెలక్ట్ చేశాడు. ఆయన జాబితాలో సీనియర్ ప్లేయర్లు హార్ధిక్ పాండ్యా, శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్‌లకు అవకాశం ఇవ్వలేదు.…
రేపటి (జనవరి 11) నుంచి ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. అయితే.. జట్టులోకి వికెట్ కీపర్‌లుగా సంజూ శాంసన్, జితేష్ శర్మలను తీసుకున్నారు. ఈ సందర్భంగా.. రిషబ్ పంత్ ప్రస్తావన తీసుకొచ్చారు సునీల్ గవాస్కర్. అతను ఒంటికాలిపై నిలబడగలిగినప్పటికీ.. 2024 ప్రపంచకప్ నాటికి తిరిగి జట్టులోకి రావాలని గవాస్కర్ తెలిపాడు. ఎందుకంటే అతను ప్రతి ఫార్మాట్‌లో గేమ్ ఛేంజర్ పాత్ర పోషిస్తాడు.
ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన రింకూ సింగ్.. ఎట్టకేలకు టీమిండియాలో స్థానం సంపాదించుకోగలిగాడు. భారత్ తరఫున ఆడాలనే తన కల నెరవేరేలా కనిపిస్తోందంటూ రింకూ.. భావోద్వేగానికి గురయ్యాడు.