Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌తో మెరుగైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌తో సంబంధాలను చెడగొట్టడంలో ఇమ్రాన్ కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు.
SCO Summit 2024: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ (SCO సమ్మిట్ 2024)లో పాల్గొనడానికి భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ చేరుకున్నారు. వివిధ దేశాల ప్రతినిధులతో అధికారిక సమావేశాలతో పాటు జైశంకర్ ఖాళీ సమయాన్ని అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. జైశంకర్ బుధవారం (16 అక్టోబర్ 2024) ఉదయం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఓ చిత్రాన్ని పంచుకున్నారు. X లో ఫోటోను పంచుకుంటూ, “మా హైకమిషన్ ప్రాంగణంలో భారత్-పాకిస్తాన్ దేశాల సహచరులతో…
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో బుధవారం ఆస్తానాలో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్న తమ పౌరులపై భారత్ ఆందోళనలను లేవనెత్తారు. వారు సురక్షితంగా తిరిగి రావాలని ఒత్తిడి చేశారు . యుద్ధం నేపథ్యంలో భారతీయుల సమస్యపై లావ్‌రోవ్‌తో లేవనెత్తారా అనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు.
కజకిస్థాన్ రాజధాని అస్తానాలో ఉగ్రవాదంపై ప్రధాని నరేంద్ర మోడీ చాణక్య అని పిలిచే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై మండిపడ్డారు. షాంఘై సహకార సంస్థ(SCO) సమావేశంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సహా పలు దేశాల నేతలు పాల్గొన్నారు.