ఫ్రాన్స్‌కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు భూమి కింద నిధిని కనుగొన్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వాతావరణ సంక్షోభం నుంచి ప్రపంచాన్ని రక్షించడంలో ఇది చాలా సహాయకారిగా ఉంటుందని సైంటిస్టులు నమ్ముతున్నారు.
ప్రతి వ్యక్తి గుర్తింపును నిర్ధారించడం నేటి అతిపెద్ద అవసరం. ఇప్పటి వరకు ఆధార్ కార్డు బయోమెట్రిక్ గుర్తింపు దీన్ని సులభతరం చేసింది. ఇందులో కళ్ల కనుపాప, వేలిముద్ర, ముఖ ఛాయాచిత్రం తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో, ఇది ఒక వ్యక్తి గోప్యతను కూడా ఉల్లంఘిస్తుంది.
ఒక బ్లాక్‌బస్టర్ సినిమా నిర్మాణానికయ్యే బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టి అంతరిక్ష ప్రయోగాల్లో భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు దండిగా నిధులు కేటాయించి ప్రోత్సహించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర సర్కార్ కు సూచించారు.
మానవునికి అందుబాటులో ఉన్నదానికంటే అందని దాని మీదనే ఎక్కువ మక్కువ. తెలియని రహస్యాలని చేదించాలనే ఆసక్తి మనిషిని అంతరిక్షం వైపు అడుగులు వేయించింది. ఆ నిశిలో ఏ నిగూడ రహస్యం దాగిందో అని భూమి మీద ఉన్న మనిషి వెతుకులాట. ఆ వెతుకులాటలో ఎన్నో కొత్త విషయాలను వెలికి తీశారు. వెలుగు చూసిన రహస్యాలు ఇసుక రేణువంత అయితే బయటపడని రహస్యాలు ఖగోళమంత.
ఈరోజు చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న ప్రపంచంలోనే మొదటి దేశంగా భారతదేశం అవతరించిందని.. ఇస్రో శాస్త్రవేత్తల జీతం అభివృద్ధి చెందిన దేశాల కంటే ఐదు రెట్లు తక్కువగా ఉన్నందున ఈ ఘనత సాధించామని ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ పేర్కొన్నారు.
ఈ నెలలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.23 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడం తో పాటు వేడి మరింత పెరగడం వల్ల, 2023 అత్యంత వేడి సంవత్సరంగా మారవచ్చు. వుడ్‌వెల్ క్లైమేట్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త జెన్నిఫర్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. ఈ రికార్డు 20 శతాబ్దం మధ్యకాలానికి సంబంధించినది. వాతావరణ మార్పుల ప్రభావం ఇంకా పూర్తిగా అర్థం కాలేదని కొన్ని పరిశోదనలు చేసిన అనంతరం అధ్యయనాల్లో పేర్కొన్నారు.. యూరోపియన్ యూనియన్ యొక్క కోపర్నికస్ క్లైమేట్ చేంజ్…
పొలాలు దున్నుతున్నప్పుడు కొన్ని చోట్ల లంకె బిందెలు బయటపడుతుంటాయి.. పాత ఇళ్లను కూల్చివేసి కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టడం కోసం తవ్వకాలు జరుపుతుంటే పురాతన నాణాలు బయటపడుతుంటాయి.
ప్రపంచ వ్యాప్తంగా జూన్‌లో రికార్డు స్థాయిలో ఉష్టోగ్రతలు పెరిగాయి. ఇది గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు ఈ ఏడాది జూన్ ప్రారంభంలో నమోదైనట్టు యూరోపియన్ యూనియన్ యొక్క కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ శాస్త్రవేత్తలు గురువారం ప్రపకటించారు.