కోడి ముందా.. లేక.. గుడ్డు ముందా? ఈ ప్రశ్న యువ మనస్సులను మాత్రమే కాకుండా, అనుభవజ్ఞులైన పండితులను కూడా అబ్బురపరిచింది. చివరగా, ఉభయచరాలు, బల్లుల చుట్టూ చేసిన అధ్యయనం ఆధారంగా సమాధానాన్ని వెల్లడించడంలో శాస్త్రవేత్తలు మరింత నమ్మకంగా ఉన్నారు.
సైంటిస్టులు వైద్యశాస్త్రంలో మరో మైలురాయిని కనుగొన్నారు. వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయడంలో సహాయపడే ఏకైక అమైనో ఆమ్లాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సెమీ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ టౌరిన్ వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుందని ఒక కొత్త అధ్యయనం పేర్కొంది.
కెనడాలో చెలరేగుతున్న కార్చిచ్చుల పొగ నార్వే వరకు చేరిందని శాస్త్రవేత్తలు తెలిపారు. కెనడాలోని అడవి మంటల నుండి వచ్చే పొగ ఇప్పటికే యుఎస్‌లోని కొన్ని ప్రాంతాలను కప్పేసిందని.
6G Technology: ప్రపంచంలో అంతం అంటూ లేనివాటిలో టెక్నాలజీ కూడా ఒకటి. అందుకే.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాంకేతికతలు తెర మీదికొస్తున్నాయి. తద్వారా.. మన జీవితాలను మరింత సౌకర్యవంతంగా, సులభంగా మార్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే ఇండియాలోకి 5జీ టెక్నాలజీ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సాంకేతికత.. భారతదేశంలో శరవేగంగా దూసుకుపోతోంది. ప్రభుత్వ అంచనాలను మించిపోయింది.
Blood Falls: ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలున్నాయి. శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఆ రహస్యాలను అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ నెత్తుటి నది వారి కంట పడింది. దానిపై వారి పరిశోధనలు మొదలయ్యాయి.
Virovore : ప్రపంచంలో చైనా వంటి దేశాలు ఎన్ని వైరసులను సృష్టించినా ఏం భయపడాల్సిన పని లేదు. కరోనా కాదు కాదా వాళ్ల అమ్మలాంటి వైరస్ వచ్చిన పరపర నమిలి పారేసే కొత్త జీవిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
శాస్త్రవేత్తలు మానవ మెదడు కణాలను నవజాత ఎలుకలలో విజయవంతంగా అమర్చారు. స్కిజోఫ్రెనియా, ఆటిజం వంటి సంక్లిష్ట మానసిక రుగ్మతలను అధ్యయనం చేయడానికి, చికిత్సలను పరీక్షించడానికి కొత్త మార్గాన్ని సృష్టించారు.
తల్లిపాలలో మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయని తొలిసారిగా ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇటలీలో ప్రసవించిన వారం రోజుల తర్వాత 34 మంది ఆరోగ్యవంతమైన తల్లుల పాల నమూనాలను పరిశీలించిన తర్వాత.. శాస్త్రవేత్తలు తల్లిపాలలో మైక్రోప్లాస్టిక్స్ కణాలను కనుగొన్నారని ది గార్డియన్ నివేదించింది.
Icrisat: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇక్రిశాట్ రైతుల పాలిట ఓ వరంలా మారింది. భారతదేశంలోనే తొలిసారిగా ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది సెమీఎరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిశాట్) సైంటిస్టులు జర్మనీకి చెందిన ఫ్రాన్‌హోఫర్ డెవలప్‌మెంట్ సెంటర్ ఫర్ ఎక్స్-రే టెక్నాలజీ (EZRT) పరిశోధకుల సహకారంతో ఎక్స్‌రే రేడియోగ్రఫీని ఉపయోగించే పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని వేరుశనగల నాణ్యతను అంచనా వేయడానికి ఉపయోగిస్తామని సైంటిస్టులు తెలియజేశారు. దీంతో రైతులు నాణ్యమైన పల్లీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావొచ్చు.…