James Webb Telescope: ఈ విశాల విశ్వం మన ఊహకు కూడా అందదు. విశ్వంలోని గెలాక్సీలు, బ్లాక్ హోల్స్, నక్షత్రాలతో పోలిస్తే భూమి ఇసుక రేణువు కన్నా తక్కువే. అయితే ఎప్పటికప్పుడు విశ్వ రహస్యాలను తెలుసుకోవాలను మానవుడి ఆశ అనేక ప్రయోగాలకు కారణం అవుతోంది. మనం ఉన్న గెలాక్సీ ‘‘ మిల్కీ వే’’ గురించే మనం ఇప్పటి వరకు పూర్తిగా తెలుసుకోలేకపోయాం. అలాంటిది ఈ విశ్వంలో కొన్ని కోటాను కోట్ల గెలాక్సీలు, అందులో లక్షల కోట్ల సంఖ్యలో…
Experts Explain The Science Behind Why Heartbreak Hurts So Much: ప్రేమలో పడటం చాలా మధురమైన అనుభూతి. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి ప్రేమ ఉపయోగపడుతుంది. అయితే కొన్నిసార్లు లవ్ ఫెయిల్యూర్ అవ్వడం, లేకపోతే మనం ఎంతో ప్రేమించే వారు దూరం కావడం, చనిపోవడం వంటి విషయాల్లో చాలా ఎక్కువ మనోవేధన అనుభవిస్తారు. ఆ బాధ మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు శారీరకంగా, మానసికంగా చాలా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. భావోద్వేగ…
Brain function against toxins: మన శరీరానికి పడని, ఏదైనా విష పదార్థాలు కలిగిన ఆహారాన్ని తీసుకున్న సమయంలో వాంతులు అవుతుంటాయి. అయితే మనల్ని వీటి నుంచి రక్షించేందుకు మన మెదడు ఆ సమయంలో కీలక పనితీరును చేపడుతుంది. మెదడులో ఓ సర్క్యూట్ పనిచేయడం ప్రారంభం అవుతుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. మన శరీరంలో జరిగే ప్రతీ జీవక్రియను క్రమబద్దీకరిస్తుంటి మెదడు. ఇలాంటి మెదడు గురించి శాస్త్రవేత్తలకు తెలిసింది ఇప్పటికీ చాలా తక్కువే. ఇదిలా ఉంటే…
బంగారం అంటే ఆడవాళ్లకు ఎంత ప్రాణమో వేరేగా చెప్పన్నక్కర్లేదు. ఒళ్లంతా బంగారు ఆభరణాలు ధరించడానికి ఆడవాళ్లు ఎంతమాత్రం వెనుకాడరు. కానీ కాలిపట్టీల విషయంలో మాత్రం బంగారం కాకుండా వెండిని మాత్రమే ఆడవాళ్లు ధరిస్తారు. భారతీయ సంప్రదాయంలో మహిళలు వెండి పట్టీలు ధరించడం ఎప్పటినుంచో పాటిస్తున్న ఆచారం. ఆడవాళ్లే కాదు.. మగవాళ్ళు కూడా చేతులు, కాళ్ళకు వెండి కంకణాలు, కడియాలు ధరించేవారు. అయితే ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు. దీని వెనుక గొప్ప సైన్స్ కూడా ఉంది.…
టెక్నాలజీ వేగంగా అభివృద్ది చెందుతున్నది. సాంకేతికతలను అన్ని రంగాలకు విస్తరిస్తున్నది. ముఖ్యంగా ఆరోగ్యరంగంలో టెక్నాలజీ సహాయంతో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు జరిగాయి. జరుగుతున్నాయి. గుండెకోసం వినియోగించే పేజ్ మేకర్ మొదలు కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఇతర కీలక అవయవాల మార్పిడిలో సాంకేతికతను వినియోగిస్తున్నారు. సరైన సమయంలో అవయావాలు అందక లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని వివిధ కృత్రిమ అవయవాలను తయారు చేస్తున్నారు. ఈ కోవలోనే బయోనిక్ కళ్లను శాస్త్రవేత్తలు తయారు చేశారు.…
ఈ భూగోళంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. కొన్ని వింతలు ఆకట్టుకునే విధంగా ఉంటే, మరికొన్ని వింతలు భయపెట్టేవిధంగా ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో ఇదికూడా ఒకటిగా చెప్పవచ్చు. న్యూజిలాండ్‌లోని సౌత్ ఐలాండ్ సముద్రంలోని 1.2 కిలోమీటర్ల దూరంలో ఓ వింత జంతువును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ జంతువును చూసి మొదట షాక్ అయ్యారు. కళ్లు, మూతి పెద్దవిగా ఉండటంతో పాటు, దాని ఆకారం భయపెట్టేవిధంగా ఉంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ అట్మాస్పీయర్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు…
భూమిపై జీవం ఆవిర్భవించి ఎన్ని కోట్ల సవంత్సరాలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జీవంలో మార్పులు జరుగుతూనే ఉన్నది. ఏకకణ జీవుల నుంచి ఆధునిక మానివుని వరకు ఎన్నో మార్పులు జరిగాయి. అయితే, జీవం పుట్టుకకు ప్రధాన కారణం ఏంటి అనే దానిపై శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. భూమి పుట్టుకకు సూపర్ మౌంటైన్స్ కారణమని తేల్చారు. ఈ సూపర్ మౌంటెయిన్స్ భూమిపై రెండుసార్లు ఉద్భవించాయని గుర్తించారు. రెండు వేల నుంచి 1800 మిలియన్ సంవత్సరాల…
కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. కారోనా మహమ్మారిలో సార్స్‌కోవ్ 2, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు ప్రపంచంపై దాడి చేశాయి. సార్స్‌కోవ్ 2, డెల్టా వేరియంట్లు తీవ్రమైన ప్రభావాన్ని చూపగా, ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉన్నది. అయితే, కొత్త వేరియంట్లు ఎప్పుడు ఎలా పుట్టుకొస్తాయో ముందుగానే గమనిస్తే వాటిని ఎదుర్కొనడం తేలిక అవుతుంది. దీంతో శాస్త్రవేత్తలు కొత్త వేరియంట్ల పుట్టుకపై దృష్టి…
ఆఫ్రికాలోని బోట్స్‌వానాలో మొదటి ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత ఈ వేరియంట్ క్రమంగా ప్రపంచంలోని దాదాపు అన్నిదేశాలకు వ్యాపించింది. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల్లో ఈ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగానే ఉన్నది. మరణాల సంఖ్య సైతం తక్కువగా ఉండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పలు దేశాల్లో వివిధ వేవ్‌లకు ఒమిక్రాన్ కారణమైంది. తీవ్రత తక్కువగా ఉండటానికి గల కారణాలను పరిశోధకులు పరిశోధించారు. డెల్టా వేరియంట్…
ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. దీనిని ప్రతి ఏడాది పదుల సంఖ్యలో పర్వతారోహకులు అధిరోహిస్తుంటారు. చాలా మంది ఈ మంచుపర్వతం సానువులను సందర్శిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఈ మంచుశిఖరంపై శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. 2వేల సంవత్సరాలలో ఏర్పడిన మంచు కేవలం 25 ఏళ్లలో కరిగిపోయింది. మంచు ఏర్పడటానికి పట్టిన సమయం కన్నా 80 రెట్లు వేగంగా మంచు కరిగిపోతున్నదని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబందించిన విషయాలను నేచర్ క్లైమేట్ జర్నల్ లో పేర్కొన్నారు.…