Vomit: మనం వాంతులు చేసుకున్నప్పుడు.. మెదడులో ఏం జరుగుతుందో తెలుసా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brain function against toxins: మన శరీరానికి పడని, ఏదైనా విష పదార్థాలు కలిగిన ఆహారాన్ని తీసుకున్న సమయంలో వాంతులు అవుతుంటాయి. అయితే మనల్ని వీటి నుంచి రక్షించేందుకు మన మెదడు ఆ సమయంలో కీలక పనితీరును చేపడుతుంది. మెదడులో ఓ సర్క్యూట్ పనిచేయడం ప్రారంభం అవుతుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. మన శరీరంలో జరిగే ప్రతీ జీవక్రియను క్రమబద్దీకరిస్తుంటి మెదడు. ఇలాంటి మెదడు గురించి శాస్త్రవేత్తలకు తెలిసింది ఇప్పటికీ చాలా తక్కువే. ఇదిలా ఉంటే చైనా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ పరిశోధకులు శరీరం ప్రతిఘటించిన సమయంలో మెదడులో ఓ సర్క్యూట్ ప్రారంభం అవ్వడాన్ని గుర్తించారు.
కల్తీ లేదా టాక్సిన్స్ ఉన్న పదార్థాలను తీసుకున్న సమయంలో శరీరం వాటిని ఎదుర్కొనేందుకు కొన్ని క్షణాల్లోనే మెదడు తీసుకునే నిర్ణయాలన్ని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. దీనికి కారణం అవుతున్న పెద్దపేగు-మెదడు సర్క్యూట్ ను గుర్తించారు. ఎలుకల్లో చేసిన పరిశోధనల్లో గట్- టూ-బ్రెయిన్ సర్క్యూట్ ని గుర్తించారు. పేగుల్లోని రోగనిరోధక-న్యూరో ఎండోక్రిన్ యాక్సిస్ ద్వారా టాక్సిన్ ప్రేరేపిత సంకేతాలు మెదడుకు చేరుతాయని అధ్యయనంలో తేలింది. సరిగ్గా ఇలాగే మానవుల్లో ఈ మెకానిజం ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు.
Also Read
- Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. 'మునగాకు పొడి'.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
- Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడులో ఏం జరుగుతుంది? ప్రతి సెకను ఎందుకు కీలకం?
- Cancer: వాసనతో కుక్క క్యాన్సర్‌ను గుర్తించగలదా? సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
Read Also: Pakistan: హిందూ మహిళ తల నరికి.. చర్మం ఒలిచి దారుణంగా హత్య
ఎలుకల్లో జరిగిన పరిశోధనల్లో ఓ నమూనాను రూపొందించారు పరిశోధకులు. విష పదార్థాలు ఉన్న ఆహారం తీసుకున్న సమయంలో మెదడు టాక్సిన్లకు వ్యతిరేకంగా రక్షణాత్మక ప్రతిస్పందనలను ప్రారంభిస్తుందని న్యూరో బయాలజిస్ట్ పెంగ్ కావో అన్నారు. అయితే మెదడు ఈ విషపదార్థాలను ఎలా గుర్తిస్తుంది.. ఢిపెన్సివ్ మెకానిజంను ఎలా సమన్వయం చేస్తుంది అనేది పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉంది.
బ్యాక్టీరియాల నుంచి వెలువడి విషపదార్థం స్టెఫిలోకాకల్ ఎంటరోటాక్సిన్ ఏ(ఎస్ఈఏ), న్యూరో ట్రాన్స్ మీటర్ ఆక్టివేట్ చేస్తుందని.. ఇది పేగులు, మెదడుకు నరాల వెంట సిగ్నల్స్ ను పంపించే రసాయన ప్రక్రియ ప్రారంభిస్తాయని.. పేగులు, మెదడు మధ్య ఉండే న్యూరాన్ లను Tac1+DVC అంటారని పరిశోధకులు తెలిపారు. గట్-టూ-బ్రెయిన్ సర్క్యూట్ Htr3a+ వాగల్ సెన్సరీ న్యూరాన్‌ల ఉపసమితిని కలిగి ఉంటుంది. ఇది పేగు ఎంట్రోక్రోమాఫిన్ నుండి టాక్సిన్-సంబంధిత సంకేతాలను Tac1+కు పంపిస్తుంది. దీంతో శరీరం రక్షణాత్మక చర్యలను ప్రారంభిస్తుందని పరిశోధనల్లో తెలిసింది. ఈ న్యూరాన్ మ్యాప్, ఫుడ్ పాయిజనింగ్ కు వ్యతిరేకంగా ఢిపెన్సివ్ మెకానిజాన్ని ప్రారంభించేలా సర్క్యూట్ ఆక్టివేట్ అవుతుందని తెలిపారు.
తాజావార్తలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!