టెక్నాలజీ వేగంగా అభివృద్ది చెందుతున్నది. సాంకేతికతలను అన్ని రంగాలకు విస్తరిస్తున్నది. ముఖ్యంగా ఆరోగ్యరంగంలో టెక్నాలజీ సహాయంతో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు జరిగాయి. జరుగుతున్నాయి. గుండెకోసం వినియోగించే పేజ్ మేకర్ మొదలు కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఇతర కీలక అవయవాల మార్పిడిలో సాంకేతికతను వినియోగిస్తున్నారు. సరైన సమయంలో అవయావాలు అందక లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని వివిధ కృత్రిమ అవయవాలను తయారు చేస్తున్నారు. ఈ కోవలోనే బయోనిక్ కళ్లను శాస్త్రవేత్తలు తయారు చేశారు.
Read: LIC: ఎల్ఐసీ వద్ద భారీగా నిధులు…
కంటి నుంచి తీసిన రెటినా టిష్యూతో ఈ బయోనిక్ ఐస్‌ను సృష్టించారు. బయోనిక్ ఐస్‌లో అతి చిన్న కెమెరాను అమర్చి దానిని రెటినాతో అనుసంధానం చేస్తారు. ఫియోనెక్స్ 99 పేరుతో పిలిచే డివైజ్‌కు ఇది కనెక్ట్ అవుతుంది. ఈ మోత్తం గాగుల్స్ తో ఎటాచ్ చేస్తారు. గాగుల్స్ నుంచి రెటీనాకు ఎలక్ట్రిక్ సిగ్నల్స్ పాస్ అవుతాయి. దీంతో ఎదురుగా ఉన్న వస్తువును స్పష్టంగా చూసే అవకాశం ఉంటుంది. గొర్రెలపై ఇప్పటి వరకు ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాలు సక్సెస్ కావడంతో త్వరలోనే మనుషులపై ప్రయోగాలు నిర్వహించబోతున్నట్టు ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం పరిశోధకులు పేర్కొన్నారు.