తమిళ చిత్రం ‘లవ్ టుడే’ తో దర్శకుడిగా, నటుడిగా ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. యూత్ కు కనెక్ట్ అయ్యే కథలతో రావడంలో దిట్ట అయిన ప్రదీప్, ఈసారి ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సౌత్ ఇండియాలో వరుస ప్రాజెక్టులతో…