తమిళ చిత్రం ‘లవ్ టుడే’ తో దర్శకుడిగా, నటుడిగా ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. యూత్ కు కనెక్ట్ అయ్యే కథలతో రావడంలో దిట్ట అయిన ప్రదీప్, ఈసారి ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సౌత్ ఇండియాలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మీనాక్షికి, ప్రదీప్ సరసన నటిస్తున్న ఈ సినిమా తన కెరీర్‌లో ఒక స్పెషల్ మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read : Rajini 173: రజనీ–కమల్ మెగా ప్రాజెక్ట్‌కు.. యంగ్ డైరెక్టర్ లాక్ !
ప్రదీప్ మార్క్ కామెడీతో పాటు విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ఈ కథలో ఉండబోతుండటంతో ప్రాజెక్ట్‌పై అప్పుడే ఆసక్తి మొదలైంది.ప్రదీప్ రంగనాథన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం, ఆయన గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండబోతోందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి కాగా, మార్చి నెలలో షూటింగ్‌ను పట్టాలెక్కించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అంతే కాదు..
ఈ సినిమాను ఎక్కువ రోజులు కాకుండా, ఒకే షెడ్యూల్‌లో వేగంగా షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రదీప్ తన సినిమాల్లో ముందు నుండి కూడా ప్రజంట్ జనరేషన్‌కి కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్దుతాడు, మరి మీనాక్షితో కలిసి ఆయన చేసే ఈ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ ఇద్దరి క్రేజీ కాంబో గురించి అధికారిక ప్రకటన వెలువడితే, ఇక ఫ్యాన్స్‌కి పండగే అని చెప్పవచ్చు.