Mumbai rain: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ముంబైలోని వీధులు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో.. ఇప్పటికే 50 విమానాలు రద్దు కాగా, పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లను సైతం రద్దు చేశారు
వేసవి సెలవులు అనంతరం స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో రేపటి (జూన్ 12) బుధవారం నుంచి బడులు తెరుచుకోనున్నాయి. నేటితో వేసవి సెలవులు ముగియడంతో జూన్ 12 నుంచి తరగతుల్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల్ని ప్రోత్సహించేందుకు ఇప్పటికే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంబించారు. గతవారం నుంచి.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట ప్రారంభమైంది. అందులో భాగంగానే జూన్ 12వ తేదీన తెలంగాణ సీఎం…
నోయిడాలో ఇంతకుముందు 8వ తరగతి చదువుకునే విద్యార్థుల వరకు మూసివేయాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఎండ తీవ్రత దృష్ట్యా 12వ తరగతి వరకు మూసివేయనున్నారు. కాగా.. ఈ ఆర్డర్ అన్ని బోర్డు పాఠశాలలకు వర్తిస్తుందని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా స్కూల్ ఇన్‌స్పెక్టర్ ధరమ్‌వీర్ సింగ్ తెలిపారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ ఉత్తర్వును పాటించాలని కోరారు.
Uttarakhand : రాష్ట్రంలోని జనావాస ప్రాంతాలకు మంటలు చెలరేగడంతో పాఠశాలలు, కళాశాలలు కూడా ప్రమాదంలో పడ్డాయి. చాలా ప్రభుత్వ పాఠశాలలు నదీ తీరాలు, అడవులకు సమీపంలో ఉన్నాయి.
ఏపీలో స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వేసవిలో వడగాలుల సందర్భంగా స్కూళ్లల్లో జాగ్రత్తలు తీసుకుంటుంది విద్యాశాఖ. ఈ క్రమంలో.. వాటర్ బెల్ విధానాన్ని ప్రవేశపెడుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు డీ-హైడ్రేషనుకు గురి కాకుండా వాటర్ బెల్ మోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడు సార్లు వాటర్ బెల్ మోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టీకరణ చేశారు.
Telangana Schools: రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ నెల 15వ తేదీ నుంచి ఒకరోజు తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఆమె తెలిపారు.
త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం.. తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సూచించారు. వీటికి సొంత…