కోల్‌కతాలో ఓ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. తాజాగా ముంబైలోని థానేలో ఇద్దరు బాలికలను వేధించడంపై తల్లిదండ్రుల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. కోల్‌కతాలాగే ఇప్పుడు ముంబైలోనూ ప్రజల ఆగ్రహం కనిపిస్తోంది. ముంబైకి ఆనుకుని ఉన్న థానే జిల్లాలోని బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఇద్దరు బాలికలపై ఓ స్వీపర్ ఈనెల 14న అఘాయిత్యానికి పాల్పడిన ఘటనపై పెను దుమారం చెలరేగుతోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా భారీ…