జాతీయ విద్యా విధానంలో భాగంగా చేపడుతున్న పాఠశాలల మ్యాపింగ్ కార్యక్రమం పై అవగాహన సదస్సులు ముగిశాయి. ఏపీ సచివాలయంలో గత మూడు రోజులుగా కొనసాగిన ప్రజాప్రతినిధులతో సదస్సులు నిర్వహించారు. చివరిరోజు సదస్సుకు అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీనికి హాజరైన మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజద్ భాషా, ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. పాఠశాలల మ్యాపింగ్ వల్ల…