ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. గత మూడు రోజుల్లో ఐదుకు పైగా కేసులు నమోదయ్యాయి. తొలుత సత్యనారాయణపురానికి చెందిన ఓ మైనర్ బాలిక కనిపించకుండా పోయింది. ఆ అమ్మాయి పేరు మోనిషా. గుడికి వెళ్ళిన ఈ బాలిక, తిరిగి ఇంటికి రాలేదు. అలాగే.. చెన్నారెడ్డి కాలనీలో 8వ తరగతి చదువుతున్న వంశీ కృష్ణా ఐస్‌క్రీమ్ కోసం వెళ్ళి అదృశ్యమయ్యాడు. అనంతరం లక్ష్మీపురానికి చెందిన వివేక్ కూడా మిస్సింగ్ అంటూ మరో ఫిర్యాదు అందింది.…