Tirupati Missing Cases: మరో మహిళ అదృశ్యం.. మూడు రోజుల్లో ఐదుకి పైగా కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. గత మూడు రోజుల్లో ఐదుకు పైగా కేసులు నమోదయ్యాయి. తొలుత సత్యనారాయణపురానికి చెందిన ఓ మైనర్ బాలిక కనిపించకుండా పోయింది. ఆ అమ్మాయి పేరు మోనిషా. గుడికి వెళ్ళిన ఈ బాలిక, తిరిగి ఇంటికి రాలేదు. అలాగే.. చెన్నారెడ్డి కాలనీలో 8వ తరగతి చదువుతున్న వంశీ కృష్ణా ఐస్‌క్రీమ్ కోసం వెళ్ళి అదృశ్యమయ్యాడు. అనంతరం లక్ష్మీపురానికి చెందిన వివేక్ కూడా మిస్సింగ్ అంటూ మరో ఫిర్యాదు అందింది. తాజాగా ఓ వివాహిత మిస్ అయ్యింది.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఆ వివాహిత పేరు రేణుక. పుట్టింటికి వచ్చిన ఆమె.. మొదటి ఐదు రోజులు కుటుంబసభ్యులతోనే ఉంది. కానీ, ఆరో రోజు నుంచి అదృశ్యమైంది. ఈమెకు 2019లో నంద్యాలకు చెందిన నీటిపారుదల శాఖ జూనియర్ అసిస్టెంట్ మహేశ్వర్‌తో వివాహమైంది. ఈమధ్య కాలంలో క్రికెట్ బెట్టింగ్‌లో మహేశ్వర్ 35 లక్షలు కోల్పోయాడు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన అతడు, అవి కట్టలేక ఈనెల 31వ తేదీన ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఈ క్రమంలోనే రేణుక ఇంటి నుంచి వెళ్లింది. కాసేపయ్యాక భర్త మహేశ్వర్ నుంచి రేణుక తండ్రి ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది.
‘మా ఇబ్బందులేవో మేము పడతాం.. మీరు ఆందోళన చెందొద్దు.. మా గురించి ఆలోచించొద్దు’ అంటూ మహేశ్వర్ మెసేజ్ పంపాడు. దీంతో ఆందోళన చెందిన రేణుక తండ్రి.. వెంటనే అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుల టెన్షన్‌తో ఎక్కడ భార్యాభర్తలిద్దరు ఆత్మహత్య చేసుకుంటారోనని భయాందోళనలకు గురవుతున్నారు.
తాజావార్తలు
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!