Hyderabad: స్కూలు బస్సుల్లో ఆర్టీవో అధికారుల తనిఖీలు.. డ్రైవర్ పై కేసు నమోదు
- నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం
- స్కూళ్ళు-కాలేజీల బస్సులను ఆర్టీవో అధికారుల తనిఖీలు
- నిబంధనలు పాటించని స్కూలు బస్సులు సీజ్
- డ్రైవింగ్ లైసెన్స్ ఎక్పైర్ కావడంతో డ్రైవర్ పై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతుండటంతో స్కూళ్ళు, కాలేజీల బస్సులను ఆర్టీవో అధికారుల తనిఖీలు చేపట్టారు. ఈ రోజు నుండి పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులను రవాణా చేసే స్కూల్ బస్సు లపై ఫొకస్ పెట్టారు. నిబంధనలు పాటించని స్కూలు బస్సులపై వేట వేస్తున్నారు. ఫిట్నెస్ కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. వాహనాలను రవాణా శాఖ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. లంగర్ హౌజ్ లో స్కూలు, కాలేజీల బస్సుల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని స్కూలు బస్సును సీజ్ చేశారు అధికారులు.
Read also: Manhole: మ్యాన్ హోళ్లు తెరిస్తే జైలుకే.. జలమండలి అధికారులు హెచ్చరిక..
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
డ్రైవింగ్ లైసెన్స్ ఎక్పైర్ కావడంతో డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. మరోవైపు హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో స్కూల్ బస్సులను తనిఖీ చేపట్టారు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్, ఫయర్ సేఫ్టి కిట్, ఫస్ట ఎయిడ్ కిట్ లను క్షణంగా తనిఖీలు చేస్తున్నారు. పలు బస్సులను రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. రాజేంద్రనగర్, శంషాబాద్, మొయినాబాద్, శేరిలింగంపల్లి తో పాటు పలు చోట్ల విసృత సోదాలు నిర్వహిస్తున్నారు. ఫిట్‌నెస్ లేని బస్సుల్లో విద్యార్థులను తరలిస్తే ఆ బస్సులను సీజ్ చేసి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Read also: Harom Hara Movie: క్లైమాక్స్ మతి పోయేలా ఉంటుంది.. ఊహించని సినిమా ఇది!
స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు రవాణా శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రవాణా శాఖ దృష్టి సారిస్తున్నారు. ప్రతి విద్యా సంస్థ యొక్క వాహన ఫిట్‌నెస్ సర్టిఫికేట్ యొక్క చెల్లుబాటు ప్రతి సంవత్సరం మే 15వ తేదీ నాటికి పూర్తవుతుంది. స్కూల్ బస్సులు మరమ్మతులు చేయించుకుని ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాలి. ఈసారి ధ్రువపత్రం అందని వాహనాలతో పాటు విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. రవాణా శాఖ నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది.
Read also: Harom Hara Movie: క్లైమాక్స్ మతి పోయేలా ఉంటుంది.. ఊహించని సినిమా ఇది!
ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు రోడ్డెక్కితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. విద్యాసంస్థలకు చెందిన బస్సులకు ఏటా ఫిట్‌నెస్ తనిఖీలు నిర్వహించాలని, డ్రైవర్ ఆరోగ్యంగా ఉండాలని, 60 ఏళ్లు మించకూడదని చెప్పారు. డ్రైవర్ వివరాలను ఆర్టీఏ కార్యాలయంలో సంప్రదించాలని, 5 సంవత్సరాల అనుభవం ఉన్న వారినే నియమించుకోవాలని పేర్కొన్నారు. ఫిర్యాదు పుస్తకం, ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉంచాలని, ప్రతి బస్సులో అటెండర్‌ను నియమించాలని సూచించారు. జాబితాతో పాటు బస్సు రూట్ ప్లాన్ జత చేయాలని స్పష్టం చేశారు. డ్రైవర్ అగ్నిమాపక యంత్రం, RTO నిర్వహించే ఒక-రోజు రిఫ్రెషర్ శిక్షణా కోర్సుకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. తెలంగాణలో ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన బస్సులు 23,824 ఉన్నాయి.
Health Tips : దగ్గినా.. తుమ్మినా మూత్రం పడుతుందా.. ఇలా చేస్తే సమస్య దూరం
తాజావార్తలు
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!