విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది.. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ తీసుకురానున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ విద్యా బోర్డు IB భాగస్వామ్యం కాబోతోంది.. దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో ఒప్పందం జరగనుంది.. ఈ రోజు ఉదయం 10 గంటలకు అంతర్జాతీయ విద్యా బోర్డుతో రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌సీఈఆర్‌టీ (SCERT) ఒప్పందం చేసుకోబోతోంది..