Telangana Congress: హైదరాబాద్‌లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, రాష్ట్ర బడ్జెట్‌పై చర్చించనున్నట్లు సమాచారం. రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది. ఈ సమావేశం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమవుతుంది. ముందుగా పార్టీ ఎమ్మెల్యేలతో…
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని ప్రవేవపెట్టారు. అయితే.. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం దేశంలో అనేక పోరాటాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంలో కట్టుబడినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా, ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం తనకు అత్యంత సంతృప్తినిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే.. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్…
Legislative Council : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరిగింది. ఉభయ సభల్లో కులగణన , ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడారు. మధుసూదనాచారి మాట్లాడుతూ, కులగణన లెక్కలపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని, తమకు ఈ విషయంలో తగిన అవకాశం ఇవ్వాలని కోరారు. ఆయన చెప్పిన ప్రకారం, ఈ డేటా వివరాలు ఇప్పటివరకు అందరికీ అందుబాటులో లేవని…
Uttam Kumar Reddy : నల్గొండ లోకసభ స్థానం పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. 2024 లో అందరికీ మంచి చేశాము.. 2025లో కూడా అలానే చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, స్వతంత్ర భారతదేశంలో కులగనన చేయడం మొదటి సారి అని…
Uttam Kumar Reddy : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు కోర్ట్ ఆదేశాలతో ఎస్సీ వర్గీకరణను ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు. 2700 కోట్లతో రైతు రుణమాఫీ కి ఇవ్వడం జరిగిందని, 850కోట్లు రైతుల మీద వడ్డీ భారం పడిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్…
విజయవాడలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అంశం ఇంకా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లోనే ఉందని.. దీనిపై చంద్రబాబు చొరవ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్యను మందకృష్ణ కోరారు. మహానాడులో ఎస్సీ వర్గీకరణ అంశం పరిష్కారానికి టీడీపీ తీర్మానం చేసేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉందని మందకృష్ణ ఆరోపించారు. Andhra Pradesh:…